AP Election Polling 2024:ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై ఈసీకి చంద్రబాబు లేఖ
ABN , Publish Date - May 13 , 2024 | 04:20 PM
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (INara Chandrababu Naidu) లేఖ రాశారు.
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) లేఖ రాశారు. నేడు జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.
నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీసులు శాంతిభద్రతలు పరిరక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. వైసీపీ కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎన్టీఏ కూటమి అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. పోలీసుల కళ్లెదుటే ఒక్క పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు 12 కు పైగా రక్తపు గాయాలతో కూడిన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు అన్నారు.
AP Election Polling 2024: తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాకు మించిన సీన్.. టెన్షన్ టెన్షన్..
లావు శ్రీకృష్ణదేవరాయలపై దాడి చేశారు..
‘‘ఆదివారం నాడు మాచర్ల నియోజకవర్గంలో ఒక సీనియర్ నాయకుడిని హత్య చేసి శవాన్ని ఊరి పొలిమేరలో పడేశారు. మాచర్ల నియోజకవర్గాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు సున్నితమైన నియోజకవర్గంగా పరిగణించింది. అయినప్పటికీ మాచర్ల, గురజాలలో అనేక హింసాత్మక ఘటనలు చేసుకున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నరసారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేసి మూడు కార్లను ధ్వంసం చేశారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన మనుషులతో హల్ చల్ చేస్తూ నరసారావుపేటలో 144 సెక్షన్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మరో సున్నితమైన నియోజకవర్గంగా పరిగణించిన పుంగనూరులో టీడీపీకి చెందిన పోలింగ్ ఏజెట్లను కిడ్నాప్ చేశారు. తాడిపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డిలు తాడిపర్తి మునిసిపల్ టౌన్ పరిధిలోని పోలింగ్ బూత్‌ల్లో తన అనుచరులతో ఇష్టానుసారం తిరుగుతున్నారు. ప్రకాశం జిల్లాలోని దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్నారు. టీడీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ, ఆమె భర్త డా. లలిత్‌లపై వైసీపీ గూండాలు భౌతిక దాడులు చేశారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
తమ్మినేని వాణిశ్రీ రిగ్గింగ్‌కి పాల్పడ్డారు..
‘‘శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గోండు శంకర్‌పై దాడి చేశారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ ఆమదాలవలసలోని 158, 159 పోలింగ్ స్టేషన్లను ఆక్రమించి రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓ ఓటర్ పై చేయిచేసుకుని దాడికి పాల్పడ్డాడు. ఏపీలో శాంతియుతంగా నిష్పాక్షికంగా ఎన్నికల జరిగే పరిస్థితులు కనపడటం లేదు. జిల్లా ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం, పోలీసు అధికారుల ఉదాశీన వైఖరితో పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావం పడేలా ఉంది. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు వేసేందుకు రెండు, మూడు గంటలు సమయం వేచిచూడాల్సి వస్తోంది. శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులకు ఈసీ ఆదేశాలు జారీ చేయాలి. వివిధ నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడానికి బాధ్యులైన అధికారుపై తగు చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు కోరారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
AP Election 2024: ఎమ్మెల్యే అన్నబత్తుని శివ కుమార్‌కు గృహ నిర్భంధం