Home » AP Polling Day
రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం.. కూటమి వైపే మొగ్గు చూపించాయి.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని.. అటు ఒకటో నెంబర్ గాని ఇటు ఐదో నెంబర్ గాని కచ్చితంగా లెగిసిపోతాయని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ని ఓడించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వ్యూహత్మకంగా పావులు కదిపారు. హిందూపురంలో ఓటమి ఎరుగని సైకిల్ పార్టీకి చెక్ పెట్టేందుకు భారీ స్కెచ్ వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish kumar Gupta) తెలిపారు. 301 సమస్యాత్మాక ప్రాంతాలను గుర్తించి సోదాల నిర్వహించినట్లు తెలిపారు. సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసినట్లు చెప్పారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ (మే -13) ముగిసిన తర్వాత జరిగిన అలర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఏపీలోని పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) స్పందించారు. మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు.
నగరంలోని పోరంకిలో ఈరోజు పోలింగ్లో జరిగిన ఘర్షణలపై విచారణ చేస్తున్నామని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా ఎస్పీ నయీం అస్మి (SP Naeem Asmi) హెచ్చరించారు. సోమవారం మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ఆరు గంటల్లోపు బూత్ లోపలికి వచ్చిన వారికి ఓటు వేసే సౌకర్యం ఉంటుందని ఎస్పీ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (INara Chandrababu Naidu) లేఖ రాశారు.
ఏపీలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) ఫిర్యాదు చేశారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ జరగుతుందని.. వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు అల్లర్లు, దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.