Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ప్రణీత్‌తో కలిసి మరో ఇద్దరు..
ABN , Publish Date - Mar 23 , 2024 | 05:42 PM
తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని (SP Bhujanga Rao) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్‌లో అదనపు ఎస్పీగా పని చేసిన ఆయన్ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు, తిరుపతి రావు (Tirupati Rao) ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఇప్పటికే ఆరు రోజుల పాటు విచారించిన పోలీసులు, ఈరోజు (23/03/24) మొత్తం కూడా విచారించనున్నారు. రేపు మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రణీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (SIB)లో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్‌ను పిలిచి విచారిస్తున్నారు. SIBలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో SIBలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు గాను దర్యాప్తు అధికారులు సైబర్ క్రైమ్, నిపుణుల సహకారం తీసుకుంటున్నారు.
ఇదే సమయంలో.. డిసెంబర్ 4వ తేదీన రికార్డ్స్ ధ్వంసమైన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అటు.. వికారాబాద్ అడవుల్లో, మూసీ నదిలో హార్డ్ డిస్కుల శకలాలు స్వాధీనం చేసుకున్నారు. నాగోల్ వంతెన కింద మూసీ నది ప్రవాహంలో ఆరు హార్డ్ డిస్క్‌లు లభ్యమయ్యాయి. దీంతో.. ఇందులోని డేటాని రాబట్టడంపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు.. పలువురి ఇళ్లలో సోదాలు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. అంతకుముందు ఓ న్యూస్ ఛానెల్ యజమాని ఇంట్లో సోదాలు నిర్వహించి.. రెండు ల్యాప్‌టాప్స్, 4 ట్యాబ్‌లు, 5 పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి