Share News

YSRCP: వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి అసహనం.. బూతులు తిట్టేస్తున్నారు!

ABN , Publish Date - Apr 25 , 2024 | 09:08 AM

వైసీపీ (YSR Congress) అభ్యర్థుల్లో ఓటమి అసహనం కనిపిస్తోంది. గెలుపు అసాధ్యమని అర్థం కావడంతో తన మన అని చూడకుండా సొంత పార్టీ నాయకులపైనా బూతులతో దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం..

YSRCP: వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి అసహనం.. బూతులు తిట్టేస్తున్నారు!

  • ఎమ్మెల్యే పదవివెంట్రుకతో సమానం

  • నీవు అనవసరంగా కామెంట్లు చేయడం మానేయ్‌

  • సొంత పార్టీ నాయకుడిపై సామినేని ఉదయభాను బూతుపురాణం

విజయవాడ, ఆంధ్రజ్యోతి: వైసీపీ (YSR Congress) అభ్యర్థుల్లో ఓటమి అసహనం కనిపిస్తోంది. గెలుపు అసాధ్యమని అర్థం కావడంతో తన మన అని చూడకుండా సొంత పార్టీ నాయకులపైనా బూతులతో దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జగ్గయ్య పేటకు చెందిన ఓ వైసీపీ నాయకుడు పార్టీ కార్యకర్తల వద్ద ఐదేళ్లలో ఒక్క పని చేయలేకపోయామని, ఇప్పుడు పరిస్థితి అంత అనుకూలించడం లేదని, గెలుపు కష్టమేనని వ్యాఖ్యానించారు. ఈ విషయం జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను (Samineni UdayaBhanu) దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహోదగ్రుడయ్యారు. ఆ దళిత నాయకుడికి ఫోన్‌ చేసి బూతులతో విరుచుకుపడ్డారు.

AP Elections: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. ఆ ఇద్దరూ ఎదురు తిరిగారు!



సోషల్ మీడియాలో హల్‌చల్!

నాకు ఎమ్మెల్యే పదవి వెంట్రుక ముక్కతో సమానం. నీవు అనవసరంగా కామెంట్లు చేయడం మానెయ్‌. అదృష్టం ఉంటే గెలుస్తాం.. లేకుంటే ఓడిపోతాం. ఎలా అవ్వాలో అలా అవ్వుద్ది.. బొచ్చులో మంత్రి.. అది.........తో సమానం. గెలిచినా ఓడినా నాకు బొచ్చుతో సమానం’ అంటూ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దళితులపై ఉదయభాను నోరుపారేసుకోవడం ఇది రెండోసారి. గతంలో సొంత పార్టీకి చెందిన గిరిజన వికలాంగుడిని బండబూతులు తిట్టిన ఉదంతంలో ఉదయ భానుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా సొంత పార్టీకే చెందిన దళిత నాయకుడిపై నోరుపారేసుకోవడంతో వైసీపీ శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2024 | 09:10 AM