AP Elections: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగులపై ఈసీ వేటు
ABN , Publish Date - Mar 19 , 2024 | 03:27 PM
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. కుప్పం మండల టెక్నీకల్ అసిస్టెంట్ మురుగేష్, చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ తరుపున కండువా కప్పుకొని ప్రచారం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్, అధికారుల సమావేశనికి వైసీపీ తరుపున హాజరైన మురుగేష్‌పై ఈసీ చర్యలు తీసుకుంది.
చిత్తూరు, మార్చి 19: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎన్నికల కమిషన్ (Election Commission) వేటు వేసింది. కుప్పం మండల టెక్నీకల్ అసిస్టెంట్ మురుగేష్, చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ తరుపున కండువా కప్పుకొని ప్రచారం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్, అధికారుల సమావేశనికి వైసీపీ తరుపున హాజరైన మురుగేష్‌పై ఈసీ చర్యలు తీసుకుంది. నిన్న కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలంలో చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేశారు. వెంకటేష్ ప్రచారం చేస్తున్న ఫోటోలు వైరల్ కావడంతో శాఖ పరమైన చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇవి కూడా చదవండి..
Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే
JMM: జేఎంఎంకు సీత సోరెన్ షాక్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా, బీజేపీలో చేరిక
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..