AP Elections: వైసీపీ సభలంటే రామంటున్న జనం.. బెదిరింపులకు దిగుతున్న నేతలు..!
ABN , Publish Date - Apr 08 , 2024 | 10:16 AM
వైసీపీ సభలకు లక్షలాదిగా జనం తరలివస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటు న్నారు. తమ నాయకుడు ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నా రంటూ వైసీపీ నాయకులు చెప్పుకుంటుంటే వాస్తవం మాత్రం మరోలా ఉంది.
వైసీపీ సభలకు లక్షలాదిగా జనం తరలివస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. తమ నాయకుడు ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారంటూ వైసీపీ నాయకులు చెప్పుకుంటుంటే వాస్తవం మాత్రం మరోలా ఉంది. జగన్ (Jagan) సభలకు జనాన్ని తరలించడం కోసం ద్వితీయ శ్రేణి నాయకులు తెగ కష్టపడుతున్నారట. బతిమలాడినా వైసీపీ (YCP) సభలంటూ రామంటున్నారట. దీంతో చేసేదేమి లేక పక్క జిల్లాల నుంచి జనాన్ని తరలిస్తూ దొరికిపోయారు వైసీపీ నాయకులు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. సభలంటే జనాన్ని తరలించడం మామూలే. కానీ ఎన్నికల సభలకు కూడా జనాన్ని తరలిస్తున్నారు వైసీపీ నాయకులు. జగన్ మీటింగ్ జరిగే ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలోనూ జన సమీకరణ చేయాల్సి వస్తోందట. జనాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యే్క వాహనాలు పెట్టినా ఆశించిన స్థాయిలో జనం రావడం లేదట. తమ ప్రాంతంలో సభ జరిగితే సమీకరణ చేస్తాం కాని, ఇతర జిల్లాల్లో సభలకు జనాన్ని పంపాలంటూ తమపై ఒత్తడి తెస్తున్నారంటూ సొంత పార్టీ నాయకులే వాపోతున్నారు.
YSRCP VS TDP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. టీడీపీ నేతలపై దాడి
అసలే ఎండలు..
ఎండా కాలం జనసమీకరణ వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. వైసీపీ సభలు అంటేనే ప్రజలు దూరంగా ఉంటున్నారంట. రోజుకు రూ.300 నుంచి రూ.500 ఇస్తున్నా జనం దొరకడం లేదు. కనీసం రూ.500 నుంచి 700 అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జన సమీకరణకే కోట్లలో ఖర్చు పెట్టాల్సి వస్తోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అద్దె చెల్లించి ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాలు ఏర్పాటు చేసినా అవి ఫుల్ కాకపోవడంతో ఒక్కో బస్సులో ఐదుగురు కూడా ఉండటం లేదట. వైసీపీ సభలకు వెళ్తున్న ఖాళీ బస్సులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడి మరీ వైసీపీ నాయకులు జనాన్ని తరలిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Balasouri: మూడు రాజధానుల పేరుతో ఏపీని నాశనం చేసిన సీఎం జగన్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..