AP Politics: మంత్రివర్గంలో స్థానంపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 06 , 2024 | 09:47 PM
ఎన్డీఏ కూటమిలో మంత్రివర్గంలో స్థానంపై భీమిలీ తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకోవాలో టీడీపీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు.
విశాఖపట్నం: ఎన్డీఏ కూటమిలో మంత్రివర్గంలో స్థానంపై భీమిలీ తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకోవాలో టీడీపీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చిన భీమిలి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు.వైసీపీ ఘోర పరాజయానికి కర్త, కర్మ, క్రియ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే అని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జగన్ కొరివితో తల గొక్కున్నారన్నారు. జగన్ పార్టీ ఘోర పరాజయానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఒక కారణమని చెప్పారు.తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కలయిక..సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు. అందుకే ప్రతిపక్ష హోదాను జగన్ పార్టీ కోల్పోయిందని తెలిపారు. విశాఖను రాజధానిని చేస్తామనడం జగన్‌ది తుగ్లక్ నిర్ణయమన్నారు.
అసెంబ్లీలో అమరావతికి మద్దతిచ్చి...ఆ తర్వాత జగన్ మూడు రాజధానులు అన్నారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ రాజధాని వద్దని ప్రజలు వైసీపీని ఓడించారన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గతంలో రాజీనామా చేశానని.. ఇప్పుడు ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కృషి చేస్తానని గంటా శ్రీనివాసరావు తెలిపారు.