Share News

AP Politics: వైసీపీలోకి జనసేన పిఠాపురం నేత

ABN , Publish Date - Mar 20 , 2024 | 07:57 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన పిఠాపురం మాజీ ఇంచార్జీ మాకినీడి శేషుకుమారి బుధవారం నాడు వైసీపీలో చేరారు. 2019 ఎన్నిలక్లో శేషుకుమారి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఈ సారి జనసేన టికెట్ దక్కే అవకాశం లేదు.

AP Politics: వైసీపీలోకి జనసేన పిఠాపురం నేత

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా కొందరు నేతలు పార్టీ మారుతున్నారు. పార్టీలో ప్రాధాన్యం, అధికారంలోకి వస్తే నామినెటేడ్ పదవులు ఇస్తామనే హామీతో పార్టీలో చేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) సమక్షంలో జనసేన పిఠాపురం మాజీ ఇంచార్జీ మాకినీడి శేషుకుమారి బుధవారం నాడు వైసీపీలో (YCP) చేరారు. 2019 ఎన్నిలక్లో శేషుకుమారి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బరిలోకి దిగుతున్నారు. ఈ సారి జనసేన టికెట్ దక్కే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఇతర చోట్ల కూడా సీటు ఇచ్చే అవకాశం లేదు. అందుకోసమే శేషుకుమారి అధికార వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, పిఠాపురం వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త వంగా గీత పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గల 175 స్థానాలకు మే 13వ తేదీన ఎన్నిక జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

AP Politics: లోక్ సత్తా జేపీ సంచలన నిర్ణయం.. ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటన

Updated Date - Mar 20 , 2024 | 08:12 PM