AP Election 2024: కేసుల కోసం గత ఐదేళ్లు బీజేపీతో అంటకాగింది జగన్ రెడ్డే..:ఎంఏ షరీఫ్
ABN , Publish Date - May 09 , 2024 | 07:26 PM
ఐదేళ్ల జగన్ (CM Jagan) పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ (MA Sharif) తెలిపారు. తెలుగుదేశం పార్టీ పాలనలోనే ముస్లిం సమాజానికి సంక్షేమం, అభివృద్ధి జరిగిందని అన్నారు. ఓడిపోయే వైసీపీకి ఓటేసి మీ అమూల్యమైన ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
అమరావతి: ఐదేళ్ల జగన్ (CM Jagan) పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ (MA Sharif) తెలిపారు. తెలుగుదేశం పార్టీ పాలనలోనే ముస్లిం సమాజానికి సంక్షేమం, అభివృద్ధి జరిగిందని అన్నారు. ఓడిపోయే వైసీపీకి ఓటేసి మీ అమూల్యమైన ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ... ముస్లిం రిజర్వేషన్లపై వైసీపీ అబద్ధాలు, అసత్యపు ప్రచారాలు చేస్తోందని.. దయచేసి వీటిని ముస్లింటు నమ్మొద్దని అన్నారు.
AP Election 2024: వారికి బొత్స సత్తిబాబు ఊడిగం చేస్తున్నారు.. చంద్రబాబు విసుర్లు
వైసీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి మసీదుల్లో ముస్లిం మత పెద్దలు ఆ పార్టీకి ఓటు వేమమని చెప్పడం సరైన పద్ధతి కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే గెలుపని, చంద్రబాబు సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీకి మైనార్టీలను దూరం చేశామన్న అపవాదును ముస్లిం మతపెద్దలు తెచ్చుకోవద్దని అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు.
నేడు బీజేపీతో టీడీపీ పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని ఉద్ఘాటించారు. ఈ ఐదేళ్లు వైసీపీ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, పెట్టుబడులు రాలేదని అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనుకకు పోయిందని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ముస్లింలు గమనించాలని.. ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బిడ్డల భవిష్యత్ కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ఎంఏ షరీఫ్ కోరారు.
AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!
Read Latest AP News And Telugu News