AP Elections: అవేం సమాధానాలు జగన్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు..
ABN , Publish Date - May 04 , 2024 | 03:22 PM
ఏపీ సీఎం జగన్ ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమధానాలపై జగన్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సీఎం స్థాయిలో ఉండి అవేం సమాధానాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. జాతీయ రాజకీయాలపై జగన్ ఇచ్చిన సమాధానంపైనా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది జగన్ ఇంటర్వ్యూపై పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం సీఎం కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు ఉన్నారని, ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఏపీ సీఎం జగన్ ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమధానాలపై జగన్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సీఎం స్థాయిలో ఉండి అవేం సమాధానాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. జాతీయ రాజకీయాలపై జగన్ ఇచ్చిన సమాధానంపైనా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది జగన్ ఇంటర్వ్యూపై పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం సీఎం కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు ఉన్నారని, ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఇంటర్వ్యూపై వైసీపీ శ్రేణులే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇవ్వలేకపోయారని కొందరు పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారట.
వైనాట్ 175 నినాదాన్ని ప్రారంభంలో గట్టిగా వినిపించిన జగన్.. ప్రస్తుతం ఆ మాట చెప్పకపోవడమే కాకుండా.. ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి నెలకున్నట్లు ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. ప్రధాని మంత్రి ఎవరవుతారనేదానిపై నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. ప్రజల అభిప్రాయం ఇలా ఉందని అంటూనే తాను సెఫాలజిస్టు కాదంటూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఏం మాట్లాడితే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో తెలియని పరిస్థితుల్లో సమాధానాలను దాటవేశారంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
AP Elections: చీఫ్ సెక్రటరీ, డీజీపీ జగన్ బాటలో నడుస్తున్నారు: కనకమేడల రవీంద్రకుమార్
వైసీపీ గెలిచే సీట్లపై ఏమన్నారంటే..
వైసీపీ ఎన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. జగన్ 175 అనే సమాధానం కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోయారు. దీంతో జగన్ విశ్వాసాన్ని కోల్పోయారనే విషయం స్పష్టమవుతోంది. అయితే తాను ఇచ్చిన నినాదం నుంచి వెనక్కి తగ్గినట్లు ఉండకూడదనే ఉద్దేశంతో క్లీన్ స్వీప్ చేస్తామని సమాధానం చెప్పారు. దీనిపై కూడా నెటిజన్లు జగన్‌ను కామెంట్స్‌తో ఓ ఆటాడుకుంటున్నారు. నిజమే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందని అడిగితే ఒకటి గెలవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. లోక్‌సభ, అసెంబ్లీ అని అడిగితే వన్ అంటూ సమాధానం చెప్పారు. రెండు ప్రశ్నలకు ఒకటే సమాధానం ఇవ్వడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక తప్పించుకుంటున్నారంటున్నారు.
ప్రధాని ఎవరనేదానిపై..
దేశంలో ప్రధాని ఎవరు అవుతారని యాంకర్ అడిగిన ప్రశ్నకు జగన్ తనకు ఐడియా లేదని, అంచనా వేయలేదని, ఆ విషయం గురించి తాను ఆలోచించడం లేదన్నారు. మీ అంచనా ఏమిటని ఇదే ప్రశ్నను మళ్లీ అడగ్గా.. చాలా మంది మోదీ అనుకుంటున్నారని, ఇదే చర్చ ఎక్కువుగా జరుగుతుందని చెప్పారు. మీరు ఏమనుకుంటున్నారంటే తాను సెఫాలజిస్ట్ కాదని చెప్పారు. సీఎంగా జాతీయ రాజకీయాల గురించి ఆలోచించరా.. ఓన్లీ మీరు ఏపీకే పరిమితమా అని యాంకర్ అడగ్గా.. అలా ఏం కాదని.. ఈ విషయంలో తనకు ఎలాంటి అభిప్రాయం లేదని, పరిస్థితులను బట్టి ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకమైన పరిస్థితులు ఉంటాయని, అందుకే అక్కడ ఏం జరుగుతుందో తాను చెప్పలేనని జగన్ చెప్పారు. మొత్తానికి జగన్ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు మాత్రం ఆయనపై ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు.
AP Elections: ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?..వైసీపీ నేతలను ప్రశ్నించిన సుజనా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu News