Share News

AP Pensions: పెన్షన్ల సొమ్ములు పడినా ఫలితం శూన్యం..!

ABN , Publish Date - May 02 , 2024 | 10:33 PM

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌ల (AP Pensions) పంపిణీపై ఎంత హైడ్రామా జరుగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జగన్‌ ప్రభుత్వం (Jagan Govt) పన్నిన పన్నాగంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్న పరిస్థితి. మండుటెండలో వెళ్లి బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. ఆఖరికి..

AP Pensions: పెన్షన్ల సొమ్ములు పడినా ఫలితం శూన్యం..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌ల (AP Pensions) పంపిణీపై ఎంత హైడ్రామా జరుగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జగన్‌ ప్రభుత్వం (Jagan Govt) పన్నిన పన్నాగంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్న పరిస్థితి. మండుటెండలో వెళ్లి బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. ఆఖరికి.. ఒకటి కాదు రెండు ఏకంగా పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల్లో చాలా మందికి తమ ఖాతాల్లో పింఛన్‌ డబ్బు జమ కాకపోవడంతో లబోదిబో మంటున్నారు. దీంతో పెన్షన్ సొమ్ములు పడినా ఫలితం శూన్యమైంది.


ఎందుకిలా..?

రూ.1,945కోట్ల సామాజిక భద్రత పెన్షన్ల కోసం నిధులు విడుదల చేసినా లబ్ధిదారులకు అందని పరిస్థితి ఏపీలో ఉంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా బ్యాంకులకు నగదు చెల్లించేశామని ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. 48లక్షల 17వేల 718మందికి పెన్షన్లు చెల్లించేశామని వెల్లడించిన సర్కార్.. బ్యాంకులకు వెళ్లిన లబ్ధిదారులకు కేవైసీ కష్టాలు మొదలయ్యాయి. ఆధార్‌, పాన్‌లింక్‌ చేసుకోవాలంటూ బ్యాంకు అధికారుల కొర్రీలు పెట్టడంతో పండుటాకులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు.. 74,399 బ్యాంకు ఖాతాలు ఇన్‌ఆక్టివ్‌గా ఉన్నందున సొమ్ములు పడలేదని సమాచారం అందుతోంది. ఇక పెన్షన్ అందనివారికి రేపటి (శుక్రవారం, మే-03న) నుంచి ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ముందే చేసి ఉంటే ఒకటో తేదీనే పెన్షన్‌ అందేది అని లబ్ధిదారులు చెబుతున్నారు. కావాలనే ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందంటూ లబ్ధిదారులు మండిపడుతున్నారు. శుక్రవారం ఎంత మేరకు పంచుతుందో చూడాలి మరి.

For Related TS News and Telugu News


Updated Date - May 02 , 2024 | 10:41 PM