AP Politics: సకాలంలో పెన్షన్ అందించేలా చర్యలు తీసుకొండి: ఎలక్షన్ అబ్జర్వర్‌కు రిక్వెస్ట్
ABN , Publish Date - Apr 12 , 2024 | 08:14 PM
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ కోసం వయోవృద్దులు ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. వచ్చే నెలలో అలాంటి పరిస్థితి రానీయొద్దని సిటిజన్ ఫర్ డెమోక్రటిక్ ఫ్రంట్ కోరుతోంది. విశాఖపట్టణంలో ఆ సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎన్నికల పరిశీలకులు శ్రీరామ్ మోహన్ మిశ్రాను కలిశారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పెన్షన్ కోసం వయోవృద్దులు ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. వచ్చే నెలలో అలాంటి పరిస్థితి రానీయొద్దని సిటిజన్ ఫర్ డెమోక్రటిక్ ఫ్రంట్ కోరుతోంది. విశాఖపట్టణంలో (Vizag) ఆ సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎన్నికల పరిశీలకులు శ్రీరామ్ మోహన్ మిశ్రాను కలిశారు. వచ్చే నెల పెన్షన్ విషయంలో తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
AP Election 2024: చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి భేటీ.. ఈ అంశాలపైనే చర్చ!
ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చూడాలని వారు కోరారు. ఒకవేళ ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రాజీనామా చేసిన వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్లుగా పనిచేయొద్దని మరి మరి కోరారు. అలా అయితే ఎన్నికలు స్వేచ్చగా జరిగే అవకాశం ఉండదని వివరించారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని కోరారు.
AP HighCourt: ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్ట్ సీరియస్
ఎన్నికల్లో ధనం, మద్యం పంపిణీ విధానాన్ని సిటిజన్ ఫ్రమ్ డెమోక్రసీ వ్యతిరేకిస్తుందని వివరించారు. ధనం, మద్యాన్ని సమూలంగా అరికట్టాలని కోరారు. ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న టీచర్లను రాష్ట్ర ప్రభుత్వం దూరం పెట్టడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో కూడా పెన్షన్ల విషయంలో ఇబ్బంది కలిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం