Share News

AP Exit Polls Results 2024: ఎగ్జిట్ పోల్స్‌పై సజ్జల ఇలా అన్నారేంటి..?

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:31 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో (AP Elections) ఏ పార్టీ గెలవబోతోంది..? అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls) క్లియర్ కట్‌గా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రముఖ సర్వే, మీడియా సంస్థలు కూటమిదే గెలుపని తేల్చి చెప్పేశాయి..

AP Exit Polls Results 2024: ఎగ్జిట్ పోల్స్‌పై సజ్జల ఇలా అన్నారేంటి..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో (AP Elections) ఏ పార్టీ గెలవబోతోంది..? అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls 2024) క్లియర్ కట్‌గా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రముఖ సర్వే, మీడియా సంస్థలు కూటమిదే గెలుపని తేల్చి చెప్పేశాయి. ఇక ఒకటి అర (ఆరా) మాత్రమే వైసీపీ (YSR Congress) గెలిచి ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తుందని 94-104 వరకు రావొచ్చని ఆరా మస్తాన్ (AARAA) తన సర్వేలో తెలిపారు. అయితే.. ఇంతవరకూ వైసీపీ నుంచి ఎవరూ పెద్దగా ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన పరిస్థితి లేదు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందిస్తూ వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు హడావుడి చేస్తున్నారు. ఇక కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. కార్యకర్తలు అయితే యమా జోష్‌లో ఉన్నారు. నేరుగా రంగంలోకి దిగిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కీలక సూచనలు, సలహాలు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కౌంటింగ్ దగ్గర ఎలా ఉండాలి..? ఏం చేయాలనే విషయాలపై బాబు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఏపీలో గెలుపెవరిదో చెప్పేసిన ఆరా మస్తాన్..


sajjala-ramakrishna-reddy.jpg

ఎందుకింత కన్ఫ్యూజన్!

అటు టీడీపీ కౌంటింగ్‌పై కీలక సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో మీడియా ముందుకు వచ్చిన సజ్జల.. ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పేశారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. వైసీపీ పాజిటివ్ థింకింగ్‌తో ఎన్నికల ప్రచారం చేసిందని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్‌ను తిట్టడమే టీడీపీ పనిగా పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసింది. 48గంటల్లో ఫలితం తేలిపోతుంది. ఓటమికి మేము కారణాలు వెతుకోవాల్సిన అవసరం లేదు. పోస్టల్ బ్యాలెట్ రూల్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఎపీలో ఇవ్వడం ఏంటి..?. ఏపీలో మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు ఆదేశాలు ఇచ్చారు..?. పోలీసులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వస్తే మళ్ళీ అక్రమ కేసులు పెడుతున్నారు. కౌంటింగ్‌లో అక్రమాలు చేయాలని టీడీపీ చూస్తోందిఅని సజ్జల సంచలన ఆరోపణలు చేశారు.


TDP-And-YSRCP-Logo.jpg

బాబుపై ఆరోపణలు..

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నారని సజ్జల ఆరోపించారు. కచ్చితంగా గెలుస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసలు చంద్రబాబు ఎక్కడికి వెళ్ళారు..? ఎందుకు వెళ్ళారు..? అని సజ్జలకు పెద్ద సందేహమే వచ్చింది. తెర వెనుక ఏదో చేయాలని కుట్ర రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని.. ఫలితాలకు ముందే చేతులెత్తేసినట్లుగా సజ్జల మాట్లాడారు. అంతటితో ఆగని ఆయన.. ఎన్నికల కమిషన్‌పై లేనిపోని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈసీ కొందరికి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని.. అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.


AARAA.jpg

ఆరా మస్తాన్ సర్వేపై..!

వైసీపీకి 94-104 వరకూ అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆరా మస్తాన్ సర్వేలో తేలిన సంగతి తెలిసిందే. వైసీపీకి అనుకూలంగా వచ్చిన ఈ ఎగ్జిట్‌పోల్‌పై సజ్జల తొలిసారి స్పందించారు. ఆరాలో వైసీపీకి 150 సీట్లు వస్తాయని చెప్పలేదని.. ఎందుకంటే ఆయనకు వచ్చిన వివరాల మేరకే అంచనాలను వెల్లడించారన్నారు. ఆరాలో చెప్పిన నంబర్లకంటే ఎక్కువ సీట్లే వైసీపీకి వస్తాయని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. పాజిటివ్ ఓటు బ్యాంక్ వైసీపీ వైపే ఉందన్నారు. చూశారుగా.. ఇటు ఆరా మస్తాన్ సర్వే అక్షరాలా నిజమవుతుంది కానీ.. అంతకంటే ఎక్కువే సీట్లు వస్తాయని చెప్పడం.. ఇంకోసారేమో ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయని అనడం.. దీనికితోడు చంద్రబాబు, ఎన్నికల కమిషన్‌పై ఏవేవో ఆరోపణలు చేయడం.. ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడాకొడుతోందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి. ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి ముందుగానే సజ్జలు సాకులు వెతుక్కుంటున్నారనే చర్చ సైతం మొదలైంది. ఫైనల్‌గా ఫలితాలు వస్తాయనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.

Updated Date - Jun 02 , 2024 | 05:52 PM