Share News

AP Politics: అందుకే పవన్ గెలిచారు.. సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 06 , 2024 | 09:10 PM

అరాచక వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారని.. అందుకే ప్రజలు ఆయనకు వందకు వంద శాతం ఓట్లేసి గెలిపించారని బీజేపీ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ (Satyakumar) పేర్కొన్నారు. ఐదేళ్లుగా సంక్షేమం పేరుతో చేసిన మోసానికి వ్యతిరేక ఓటు కూటమికి పడిందన్నారు.

AP Politics: అందుకే పవన్ గెలిచారు.. సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్
Satyakumar

విజయవాడ: అరాచక వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారని.. అందుకే ప్రజలు ఆయనకు వందకు వంద శాతం ఓట్లేసి గెలిపించారని బీజేపీ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ (Satyakumar) పేర్కొన్నారు. ఐదేళ్లుగా సంక్షేమం పేరుతో చేసిన మోసానికి వ్యతిరేక ఓటు కూటమికి పడిందన్నారు. కరోనా తర్వాత ఏ దేశం సాధించని ఆర్థిక అభివృద్ధి మోదీ హయాంలో భారత్‌లో సాధించామన్నారు. ఒరిస్సాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూనే ఇక్కడ కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో సాధించిన విజయాలు ఒక రికార్డ్ అని తెలిపారు.


నిరంకుశత్వానికి, అరాచకానికి వ్యతిరేకంగా ఓటు వేశారని ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఓటమికి కారణాలు విశ్లేషణ చేసుకొని జగన్ ప్రజల మధ్యకు వెళ్లాలని హితవు పలికారు. గత నాలుగున్నరేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్‌కే జగన్ పరిమితమయ్యారని చెప్పారు. ఇప్పటికే హిట్లర్‌గా వ్యవహరిస్తూ ప్రజలను నిందిస్తున్నారన్నారు. ఆర్ధిక నేరస్తుడు ఇక మారడన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో సత్యకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చానని.. అయినా ప్రజలు ఎందుకు ఓటు వేయలేదని జగన్ అడుగుతున్నారన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన జగన్ ప్రజల్లోకి వచ్చి అడిగితే సమాధానం చెబుతారన్నారు.


మద్య నిషేధం చేస్తానని నాసిరకం మద్యం విక్రయిస్తూ కుటుంబాలను ఛిన్నా భిన్నం చేశారని మండిపడ్డారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని.. జనసేన చీఫ్ పవన్‌ కళ్యాణ్‌ను, టీడీపీ ఎమ్మెల్యేలను ధూషించేవారన్నారు. రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఉద్ఘాటించారు. శవాలను డోర్ డెలివరీ చేసి ఇప్పుడు దాడులంటూ ట్వీట్‌లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.వాళ్లు ఎన్నో నేరాలు చేశారని.. నేడుముసలికన్నీరు కారుస్తున్నారని సత్యకుమార్ విమర్శించారు.

Updated Date - Jun 06 , 2024 | 09:10 PM