Vasantha krishnaprasad: టీడీపీ ప్రస్థానంలో తెలుగు యువత దే కీలక భూమిక..
ABN , Publish Date - Apr 05 , 2024 | 03:59 PM
Andhrapradesh: తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో తెలుగు యువతదే కీలక భూమిక అని కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం మైలవరంలోని నూజివీడు రోడ్డు సి ఏం ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో వసంత కృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాధ్(చిన్ని ) కుమారుడు వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రావాలంటే తెలుగు యువత ప్రముఖ పాత్ర పోషించాలన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 5: తెలుగుదేశం పార్టీ (TDP) ప్రస్థానంలో తెలుగు యువతదే కీలక భూమిక అని కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishnaprasad) అన్నారు. శుక్రవారం మైలవరంలోని నూజివీడు రోడ్డు సి ఏం ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో వసంత కృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని ) కుమారుడు వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రావాలంటే తెలుగు యువత ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. ఏ దేశంలో తెలుగు యువత ఉన్న దానికి కృషి చేసింది చంద్రబాబు (TDP Chief Cahandrababu Naidu) అని చెప్పుకొచ్చారు.
Lok Sabha Elections: ఇది సైద్ధాంతిక పోరాటం, ఎన్నికల తర్వాతే పీఎం అభ్యర్థి ఎంపిక: రాహుల్
ప్రస్తుతం రాష్ట్రంలో యువతకు భవిత కరువైందన్నారు. యువతకు సరైన ప్రాధాన్యత లేకుండా చేశారని విమర్శించారు. విభజింపబడిన ఏపీలో యువతను పట్టించుకోని జగన్‌ను వృద్దులు అనుకోవాలా అని ప్రశ్నించారు. జగన్ (CM Jagan) యువత భవిష్యత్‌ను నాశనం చేసి, యువతకు ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి?.. ఎందుకు మాకు ఇవ్వడం లేదు? అని నన్ను కొందరు ఎస్సీ నాయకులు ప్రశ్నించారన్నారు. గత ప్రభుత్వంలో 3 వేల మంది విదేశీ విద్య వల్ల విదేశాలకు వెళితే, ఈ ప్రభుత్వం హయాంలో 12 మంది విదేశీ విద్య వల్ల వెళ్ళారంటున్నారని తెలిపారు. యువత భవిష్యత్‌పై జగన్ రెడ్డికి ముందు చూపు లేదని విమర్శలు గుప్పించారు.
విద్యుత్ ధరల కారణంగా పరిశ్రమలు మూత పడి, పక్క రాష్ట్రం తెలంగాణకు అన్నమో రామచంద్ర అని తరలి వెళ్లిపోతున్నాయన్నారు. బీ టెక్ చదివిన యువకుడు ఇటుక బట్టీలలో పనికి వెళుతున్నాడన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయినందు వల్లే తాను వైసీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో యువత భవిష్యత్‌కు మార్గం కల్పిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పనకు కృషి చేస్తామని వసంత కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
AP Election 2024: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన
AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన గుంటూరు, అనంత కీలక నేతలు
మరిన్ని ఏపీ వార్తల కోసం...