Share News

TDP: మూడు మంత్రి పదవులు, ఆ పోస్ట్ కోసం టీడీపీ పట్టు..!!

ABN , Publish Date - Jun 07 , 2024 | 08:32 AM

మెజార్టీ సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుంది. భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు రావడంతో కూటమిలోని ప్రధాన పార్టీలు డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది. మోదీ 3.O ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జేడీఎస్ కీ రోల్ పోషించనున్నాయి.

TDP: మూడు మంత్రి పదవులు, ఆ పోస్ట్ కోసం టీడీపీ పట్టు..!!
TDP

హైదరాబాద్: మెజార్టీ సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి (NDA) అధికారం చేపట్టబోతుంది. భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు రావడంతో కూటమిలోని ప్రధాన పార్టీలు డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది. మోదీ 3.O ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జేడీఎస్ కీ రోల్ పోషించనున్నాయి. జేడీయు‌కు 12 సీట్లు రాగా, టీడీపీ 16 స్థానాలను గెలుచుకుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఈ రెండు పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి.


మంత్రి పదవులు

ఆ రెండు పార్టీలు తమ మంత్రి పదవులపై బీజేపీని బెట్టు చేస్తున్నట్టు తెలిసింది. 16 సీట్లు గెలిచిన టీడీపీ మూడు మంత్రి పదవులతోపాటు స్పీకర్ పోస్ట్ తమకే కావాలని పట్టుబడుతోందని విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపై బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన జీఎంసీ బాలయోగి లోక్ సభ స్పీకర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.


స్పీకర్ పోస్ట్

లోక్ సభలో స్పీకర్‌ పోస్ట్‌ ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా అవిశ్వాస తీర్మాన సమయంలో స్పీకర్ కీలకంగా వ్యవహరిస్తారు. 1998లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వాలని కోరలేదు. స్పీకర్ పదవి కావాలని అడగగా, జీఎంసీ బాలయోగికి పదవి వరించింది.


విధులు ఇవే..!!

సభను సజావుగా నడపడం స్పీకర్ విధి. సభలో సభ్యులు గందరగోళం సృష్టిస్తే సస్పెండ్ చేయడం, సభ కార్యకలాపాలు నిర్వహించడం లాంటి ముఖ్య పనులు ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినప్పటికీ స్పీకర్ పదవి ఉంటుంది. ఆ సభ రద్దయ్యే వరకు ఆ వ్యక్తే స్పీకర్‌గా ఉంటారు. ఒకవేళ స్పీకర్‌‌ను పదవి నుంచి తొలగించాలంటే సభలో 50 శాతం కన్నా ఎక్కువ సభ్యులు చేసే తీర్మానం ద్వారా తొలగించే అవకాశం ఉంటుంది.

Updated Date - Jun 07 , 2024 | 08:45 AM