YSRCP: కోడ్ వచ్చినా ఆగని వైసీపీ అరాచకాలు
ABN , Publish Date - Mar 18 , 2024 | 03:01 PM
Andhrapradesh: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా కావలిలో మాత్రం వైసీపీ అరచకాలు ఆగని పరిస్థితి. ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరుడు అనీఫ్ కామేశ్వరి బార్‌లో ఫూటుగా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. అంతే కాకుండా బార్ యజమాని, వైసీపీ బీసీ నేత నాయుడు శ్రీను, మరికొంత మందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుతీయబోయిన వారిని తరిమి తరిమి మరీ అనీఫ్ దాడికి యత్నించాడు.
నెల్లూరు, మార్చి 18: ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి వచ్చినా కావలిలో మాత్రం వైసీపీ (YSRCP) అరాచకాలు ఆగని పరిస్థితి. ఎమ్మెల్యే రామిరెడ్డి (MLA Ramireddy) ముఖ్య అనుచరుడు అనీఫ్ కామేశ్వరి బార్‌లో ఫూటుగా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. అంతే కాకుండా బార్ యజమాని, వైసీపీ బీసీ నేత నాయుడు శ్రీను, మరికొంత మందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుతీయబోయిన వారిని తరిమి తరిమి మరీ అనీఫ్ దాడికి యత్నించాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే... అనిఫ్‌పై బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయాల్సి ఉండగా.. ఇక్కడ రివర్స్‌లో బాధుతలపైనే అనీఫ్ పోలీసులకు ముందగా ఫిర్యాదు చేశారు. మరోవైపు అనీఫ్‌ను కాపాడేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి విశ్వయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రాత్రి నుంచి తీవ్రంగా రాజీయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
AP Elections: వైఎస్ జగన్ వెనుకడుగు.. మేనిఫెస్టో ప్రకటన వాయిదా..?
Election Commission: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ సంచలన నిర్ణయం
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..