AP Elections: ‘మేం చెప్పిన వారినే పోలింగ్‌కు తీసుకురండి’... వాలంటీర్లతో వైసీపీ
ABN , Publish Date - May 12 , 2024 | 09:02 AM
Andhrapradesh: ఎన్నికలకు, సంక్షేమ పథకాల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పిస్తూ గతంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయగా.. వేల సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లతో వైసీపీ మరో పన్నాగానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి టెలికాన్ఫరెన్స్ చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను తీసుకురావాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలంటూ కోరారు.
కాకినాడ, మే 12: ఎన్నికలకు (AP Elections 2024), సంక్షేమ పథకాల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పిస్తూ గతంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయగా.. వేల సంఖ్యలో వాలంటీర్లు (Volunteers) రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లతో వైసీపీ మరో పన్నాగానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి టెలికాన్ఫరెన్స్ చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను తీసుకురావాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలంటూ కోరారు. తాము చెప్పిన వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకురావలంటూ వాలంటీర్లకు వైసీపీ అభ్యర్థి చెప్పడం పలు విమర్శలకు దారి తీస్తోంది.
Cross Vote: క్రాస్ ఓటింగ్ అంటే ఇదే.. ఇలా చేస్తే కొంప కొల్లేరే..?
రాజీనామా చేసిన వాలంటీర్లతో పెద్దాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దవులూరి దొరబాబు ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు బాగా పనిచేశారంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ఒక్కరోజు సమయం ఉందని.. రేపు మీ క్లస్టర్ పరిధిలో ఉన్న అన్ని ఇళ్ళకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని చెప్పాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం వాలంటీర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఆటోలను సిద్ధం చేశామని.. వాటిలో ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకుని వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేలా మోటివేట్ చేయాలని తెలిపారు. పోలింగ్ సరిగ్గా జరగని పక్షంలో ఆఫీసు నుంచి సమాచారం ఇస్తామన్నారు. ఎవరిని ఓటింగ్‌కు తీసుకురావాలో చెప్తామని.. వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకుని వచ్చి ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలని కోరారు. 14 లేదా 15 తేదీల్లో అందరం కలిసి మాట్లాడుకుందాం అంటూ వాలంటీర్లతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దవులూరి దొరబాబు ఫోన్‌లో సంభాషించారు.
ఇవి కూడా చదవండి...
YSRCP: మంత్రి ఉషశ్రీ చరణ్.. భర్త చరణ్ రెడ్డి బాగోతం బట్టబయలు
AP Elections 2024: మైకులు బంద్.. ప్రలోభాలు స్టార్ట్
Read Latest AP News And Telugu News