Share News

YS Sharmila: ఉపాధి కూలీలకు షర్మిల వరాలు

ABN , Publish Date - May 07 , 2024 | 11:19 AM

ఉపాధి హామీ పథకం కూలీల ఇబ్బందులను తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చలించిపోయారు. చాలిచాలని వేతనం, కనీస వేతనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనం పెంచుతామని హామీనిచ్చారు.

YS Sharmila: ఉపాధి కూలీలకు షర్మిల వరాలు
YS Sharmila

కడప: ఉపాధి హామీ పథకం కూలీల ఇబ్బందులను తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) చలించిపోయారు. చాలిచాలని వేతనం, కనీస వేతనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనం పెంచుతామని హామీనిచ్చారు. యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో వైఎస్ షర్మిల కూలీలతో సమావేశం అయ్యారు. ఉపాధి హామీ కూలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.


‘ఉపాధి హామీ కింద వసతుల కల్పన సరిగా లేదు. రోజంతా కష్టపడితే రూ.200 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. వృద్దులకు రూ.150 కన్నా ఎక్కువ రావడం లేదు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరు గార్చాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉపాధి హామీ పథకం పండుగలా సాగింది. కూలీలకు పనితో పాటు వసతుల కల్పన ఉండేది. ప్రస్తుతం మంచి నీరు కూడా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 400 రూపాయలు ఇస్తాం. జగన్ బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఉన్నది గుంజుకున్నాడు. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి...మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నాడు అని’ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు భరోసా నింపేందుకు పలుగు, పార పట్టి షర్మిల మట్టి తవ్వారు.



Read Latest
AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 11:19 AM