Jawahar: పేదల్ని అప్పులపాలు చేసిన మోసగాడు జగన్ రెడ్డి
ABN , Publish Date - Feb 29 , 2024 | 02:47 PM
Andhrapradesh: ఇళ్ల నిర్మాణం పేరుతో జగన్ రెడ్డి పేదల్ని రోడ్డున పడేశారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 25 లక్షల ఇళ్లు నిర్మిస్తానని ప్రగల్బాలు పలికిన జగన్ రెడ్డి 5 ఏళ్లలో 50 వేల ఇళ్లు కూడా పేదలకు కట్టలేదని విమర్శించారు. నివాసానికి పనికిరాని సెంటు స్థలాలు పేదలకు ఇచ్చి, వాటిలో ఇళ్లు కట్టుకోవాలని ఒత్తిడి చేసి వారిని అప్పుల పాలుచేశారన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 29: ఇళ్ల నిర్మాణం పేరుతో జగన్ రెడ్డి (CM Jagan Reddy) పేదల్ని రోడ్డున పడేశారని మాజీ మంత్రి జవహర్ (Former Minister Jawahar) మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 25 లక్షల ఇళ్లు నిర్మిస్తానని ప్రగల్బాలు పలికిన జగన్ రెడ్డి 5 ఏళ్లలో 50 వేల ఇళ్లు కూడా పేదలకు కట్టలేదని విమర్శించారు. నివాసానికి పనికిరాని సెంటు స్థలాలు పేదలకు ఇచ్చి, వాటిలో ఇళ్లు కట్టుకోవాలని ఒత్తిడి చేసి వారిని అప్పుల పాలుచేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టిన ప్రతి పేద కుటుంబంపై రూ.5 లక్షల అప్పుభారం పడిందన్నారు. ఇసుక అందుబాటులో లేకుండా చేసి, సిమెంట్.. ఇనుము ధరలు పెంచి ఇళ్ల నిర్మాణం పేరుతో చివరకు పేదల్ని అప్పులపాలు చేసిన మోసగాడు జగన్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు.
‘‘నిజంగా పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన జగన్‌కు ఉంటే చంద్రబాబు వారి కోసం కట్టించిన టిడ్కో ఇళ్లను అప్పుల కోసం తాకట్టు పెడతాడా? కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.1.180 లక్షలతో సరిపెట్టి, రాష్ట్ర వాటాగా రూపాయి ఇవ్వకుండా చేతులు దులుపుకుంటాడా?’’ అంటూ ప్రశ్నలు కురిపించారు. పేదల కోసం గతంలో చంద్రబాబు నిర్మించిన టిడ్కో ఇళ్లు పొందిన లబ్ధిదారులకు నేడు వస్తున్న బ్యాంకు నోటీసులపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...