Share News

DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 30న నోటిఫికేషన్ వచ్చేస్తోంది..

ABN , Publish Date - Jun 27 , 2024 | 11:25 AM

డీఎస్సీ 2024 నోటిఫికేషన్‍ విడుదలకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ యోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మూడేళ్ల నుంచి గత ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించలేదు. ఇప్పటి వరకూ టెట్ రాయని వారికి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 30న నోటిఫికేషన్ వచ్చేస్తోంది..

అమరావతి: డీఎస్సీ 2024 నోటిఫికేషన్‍ విడుదలకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ యోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మూడేళ్ల నుంచి గత ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించలేదు. ఇప్పటి వరకూ టెట్ రాయని వారికి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. టెట్ పరీక్షల్లో ఇప్పటికే అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 30న రెండు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయనుంది.


డిసెంబర్ 10 నాటికి అపాయింట్‍మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డీఎస్సీ షెడ్యూల్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 టీచర్ పోస్టులు భర్తీకానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో భర్తీకానున్న 439 టీచర్ పోస్టులు.. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 టీచర్ పోస్టులు.. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో భర్తీకానున్న 2024 టీచర్ పోస్టులు.. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో భర్తీకానున్న 49 టీచర్ పోస్టులు.. బాల నేరస్థులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Updated Date - Jun 27 , 2024 | 12:37 PM