-
-
Home » Andhra Pradesh » Guntur » Andhra Pradesh CM Chandrababu Naidu Visits Capital Amaravati live updates in Telugu News, Siva
-
CM Chandrababu: విశాఖ రాష్ట్ర ఆర్థిక రాజధాని: సీఎం చంద్రబాబు
ABN , First Publish Date - Jun 20 , 2024 | 12:01 PM
CM Chandrababu Naidu Visit Amaravati Live Update: ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ముగిసింది. అమరావతి పరిధిలో కీలకమైన అన్ని ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఐకానిక్ సెక్రటేరియట్, అసెంబ్లీ, జడ్జిల నివాస సముదాయం, ప్రజాప్రతినిధుల నివాస సముదాయం సహా అన్నింటినీ సీఎం పరిశీలించారు. మరికాసేపట్లో ప్రెస్‌మీట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.
Live News & Update
-
2024-06-20T15:19:41+05:30
అప్పులు విపరీతంగా చేసేశారు: చంద్రబాబు
ఏపీ గల్లా పెట్టే ఖాళీ అయింది.
రూ. 500 కోట్లతో రుషికొండను తొలిచేసి.. ప్యాలెస్ కట్టేశారు.
నిబంధనలకు విరుద్దంగా రుషికొండను నిర్మించారు.
వైసీపీకి 11 సీట్లు ఇవ్వకూడదనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
వైసీపీ నేతల్లాంటి వారికి రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా..?
ఖజానాలో ఎంత డబ్బుందో తెలీదు.
భారీగా అప్పులున్నాయి.
లెక్కలన్నీ బయటకు తీయాలి.
అధ్యయనం చేస్తాం.. ఏపీకి పూర్వ వైభవం తెస్తాం.
మొన్నటి వరకు అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు అడ్రస్ లేకుండా పోయారు.
రెండో ప్రపంచ యుద్దంలో ధ్వంసమైన హిరోషిమా, నాగసాకిలను అలాగే ఉంచారు.
వాటిని చూసి కసితో జపాన్ అభివృద్ధి చెందింది.
విధ్వంసమైన ప్రజా వేదికను అలాగే ఉంచాలన్న సూచనలు వస్తున్నాయి.
-
2024-06-20T14:48:24+05:30
విశాఖ, అమరావతి, కర్నూల్‌పై సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..
అమరావతి ప్రజా రాజధాని.
విశాఖ ఆర్ధిక రాజధాని.
కర్నూలును మోడల్ సిటీగా మారుస్తాం.
రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాం.
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించాం.
రాజధాని ఎక్కడుంటాలంటే రాష్ట్రానికి మధ్యలో ఉండాలని ఎనిమిదో తరగతి పిల్లాడు కూడా చెబుతాడు.
మూడు రాజధానులని మూడు ముక్కలాడింది వైసీపీ.
పదేళ్ల తర్వాత ఏపీ రాజధాని ఏదంటే.. చెప్పలేని పరిస్థితి తెచ్చింది వైసీపీ.
ఇక్కడి రైతులు స్వచ్ఛంధంగా భూములిస్తే అపవాదులు వేశారు.. ఇబ్బందులు పెట్టారు.
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు.
కానీ వైసీపీ రాజధానిని విధ్వంసం చేసింది.
-
2024-06-20T14:46:09+05:30
అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది: చంద్రబాబు
అందరి ఆశీస్సులు.. స్థల మహత్యం వల్లే అమరావతిని కాపాడేలా చేశాయి.
ఇక్కడున్న అల్లరి మూకలు అమరావతి నమూనాను కూడా విధ్వంసం చేశారు.
గత ఐదేళ్ల కాలంలో అమరావతిలో విధ్వంసం సృష్టించారు.
పైపులు దొంగిలించారు.. రోడ్లను విధ్వంసం సృష్టించారు.
టీడీపీ హయాంలో ఉండగా పని ఎక్కడ ఆగిందో.. అక్కడే నిలిచిపోయింది.
ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ సముదాయం 80 శాతం పూర్తైంది.
సెక్రటరీల బంగ్లాల్లో తుమ్మ చెట్లు మొలిచాయి.
అమరావతిలో ఐకానిక్ కట్టడాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
అమరావతి నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల చేస్తాం.
-
2024-06-20T14:43:08+05:30
అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారు: సీఎం చంద్రబాబు
అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారు.
అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులది.
అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శం.
అమరావతిని ప్రపంచం అంతా గుర్తించింది.
AP అంటే అమరావతి, పోలవరం.
ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెట్టాం.
అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసింది.
పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేది.
ఈ రెండింటిని వైసీపీ సర్వ నాశనం చేసింది.
-
2024-06-20T14:38:29+05:30
ఆదర్శం మీ పోరాటం: చంద్రబాబు
ఏపీలో ఏ అంటే అమరావతి పీ అంటే పోలవరం
రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలువనుంది
కర్నూలులో త్రిపుల్ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ, విశాకలో ఐఐఎం, ఒంగోలులో ఐఐటీ, విజయనగరంలో ట్రైబల్ వర్సిటీ
ఆ రోజు స్పష్టమైన విధానం ప్రకటించాం
రాజధానిపై బురదజల్లే ప్రయత్నం చేశారు
అమరావతి బ్రాండ్ దెబ్బతినే ప్రయత్నం చేశారు.
మధ్యలో రాజధాని పెట్టాలని శివరామకృష్ణ కమిటీ చెప్పింది
-
2024-06-20T14:33:54+05:30
చంద్రబాబు కామెంట్స్
ఐదేళ్లు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది
అమరావతిలో ఉండే పైపులు, ఇసుకను దొంగిలించారు
ఒక్క బిల్డింగ్ నిర్మాణం చేయలేదు
తుమ్మ చెట్లు మెలిచాయి
పోలవరం, అమరావతి ఎవరి వ్యక్తిగత సంపద కాదు: చంద్రబాబు
-
2024-06-20T14:30:26+05:30
పవిత్ర ప్రాంతం అమరావతి
పార్లమెంట్ వద్ద మట్టిని ప్రధాని మోదీ తీసుకొచ్చారు: చంద్రబాబు
యమునా నది నుంచి నీరు తీసుకొచ్చారు
అమరావతి పవిత్రమైన ప్రాంతం
స్థల మహాత్యం వల్ల మళ్లీ అధికారంలోకి వచ్చాం: చంద్రబాబు
-
2024-06-20T14:27:25+05:30
పోలవరంపై కామెంట్స్
పోలవరం పూర్తి చేసి ఉంటే ప్రతి ఎకరాకు నీరిచ్చే అవకాశం ఉండేది
పోలవరంపై వందలసార్లు వర్చువల్ రివ్యూ చేశాం
పోలవరానికి నేరుగా 30కి పైగా సార్లు వెళ్లొచ్చాను: చంద్రబాబు
రాష్ట్రానికి వరంగా ఉండాల్సిన పోలవరం శాపంగా మారింది
-
2024-06-20T14:25:03+05:30
చంద్రబాబు కామెంట్స్
కూటమికి చారిత్రాత్మక విజయం అందించారు: చంద్రబాబు
భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద విజయం ఎవరికీ రాలేదు
జగన్ ముఖ్యమంత్రిగా పనికిరాడని ప్రజలు భావించి తీర్పు ఇచ్చారు.
-
2024-06-20T13:32:25+05:30
అమరావతిలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన..
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ముగిసింది. అమరావతి పరిధిలో కీలకమైన అన్ని ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఐకానిక్ సెక్రటేరియట్, అసెంబ్లీ, జడ్జిల నివాస సముదాయం, ప్రజాప్రతినిధుల నివాస సముదాయం సహా అన్నింటినీ సీఎం పరిశీలించారు. మరికాసేపట్లో ప్రెస్‌మీట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.
-
2024-06-20T13:05:02+05:30
అమరావతి: ఐకానిక్ సెక్రటేరీయేట్, అసెంబ్లీల నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు.
నీట మునిగిన ఐకానిక్ సెక్రటేరీయేట్, అసెంబ్లీల ప్రాంతం పరిశీలించి ఆశ్చర్యపోయారు సీఎం చంద్రబాబు.
వైసీపీ విధ్వంసాన్ని మించిన నష్టం చేసిందన్నారు.
రూ. 2,229 కోట్లతో ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణ అంచనా వేసింది నాటి ప్రభుత్వం.
1.1 మిలియన్ ఎస్ఎఫ్టీలో ఐకానిక్ నిర్మాణం అంచనా వేశారు.
రూ. 2,728 కోట్లతో ఐకానిక్ సెక్రటేరీయేట్, హెచ్వోడీల నిర్మాణ అంచనా వేశారు.
3.8 మిలియన్ ఎస్ఎఫ్టీలతో ఐకానిక్ సెక్రటేరీయేట్, హెచ్వోడీల నిర్మాణానికి నాటి ప్రభుత్వం అంచనా వేసింది.
-
2024-06-20T13:00:15+05:30
Amaravati: ప్రజా ప్రతినిధుల క్వార్టర్లను పరిశీలించిన సీఎం
ప్రజా ప్రతినిధుల క్వార్టర్లను సందర్శించారు సీఎం చంద్రబాబు.
నిర్మాణం పూర్తైన రూములను సందర్శించారు.
తానొస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదు కదా అని అధికారులను ప్రశ్నించారాయన.
రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలన్నారు ఏపీ సీఎం.
అటువంటిదేం లేదని బదులిచ్చిన అధికారులు.
క్వాలిటీ మెటిరీయల్ వాడడం వల్ల సరైన నిర్వహణ లేకున్నా చెక్కుచెదరలేదని ఎమ్మెల్యే కొలికిపూడి అన్నారు.
బాత్రూలంతో సహా అన్నింటినీ పరిశీలించారు ఏపీ సీఎం.
దాదాపు 70-80 శాతం మేర నిర్మాణం పూర్తైన ప్రజా ప్రతినిధుల క్వార్టర్లు.
రూ. 421 కోట్లతో ప్రజా ప్రతనిధుల సముదాయం నిర్మాణ అంచనా.
146240 చదరపు మీటర్లల్లో నిర్మాణం.
12 టవర్లల్లో ప్రజా ప్రతినిధుల నివాస సముదాయం.
288 ఫ్లాట్లతో ప్రజా ప్రతినిధుల నివాస సముదాయం నిర్మాణం.
-
2024-06-20T12:37:00+05:30
పూర్తిగా వదిలేసిన వైసీపీ సర్కార్..
జగన్ ప్రభుత్వంలో 5ఏళ్ల పాటు రాజధాని నిర్మాణాలను నిలిపివేశారు. 70, 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను కూడా పూర్తిగా వదిలేసింది వైసీపీ ప్రభుత్వం. రాజధానిలోని నిర్మాణాల స్థితిగతులను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు.
-
2024-06-20T12:34:09+05:30
రాజధాని ప్రాంత మహిళలతో చంద్రబాబు మాటామంతీ..
రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉండవల్లిలో జగన్ కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలెంలో.. రాజధానికి శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి సాష్టాంగ ప్రమాణం చేశారు. రాజధాని అమరావతి మహిళలతో చంద్రబాబు మాట్లాటారు. రాజధాని నిర్మాణాలను పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఐకానిక్ నిర్మాణాల సైట్స్‌ను పరిశీలించారు. సీడ్‌యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు. మంత్రులు, జడ్జిల గృహసముదాయాలను పరిశీలించారు. -
2024-06-20T12:06:33+05:30
రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఉండవల్లి, మంగళగిరి, ఉద్దండరాయునిపాలెం ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
-
2024-06-20T11:00:23+05:30
CM Chandrababu Naidu Visit Amaravati Live Update: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన ఆయన.. ఉండవల్లి గ్రామం మీదుగా రోడ్డు మార్గంలో తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లాకు వెళ్తారు. తొలుత ప్రజా వేదికను సందర్శించారు. అనంతరం.. ఉద్దండరాయుడి పాలెం ప్రాంతంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు.