AP Politics: రాజీనామా బాటలో మరో వైసీపీ ఎమ్మెల్యే.. ఎవరంటే...?
ABN , Publish Date - Jan 23 , 2024 | 08:55 PM
వైసీపీ ( YCP ) హై కమాండ్‌పై పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా అసమ్మతి గళం విప్పుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను వైసీపీ అధిష్టానం మారుస్తోంది. మార్పులపై వైసీపీలో ఒక్కొక్కరూ వరుసగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ ( YCP ) హై కమాండ్‌పై పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా అసమ్మతి గళం విప్పుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను వైసీపీ అధిష్టానం మారుస్తోంది. మార్పులపై వైసీపీలో ఒక్కొక్కరూ వరుసగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ( CM JAGAN ) తీరుపై ఆయా నేతలు మండిపడుతున్నారు. ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు ( MP Lavu Krishna Devarayalu ) నేడు ( మంగళవారం ) వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎంపీ బాటలోనే మరికొంత మంది వైసీపీ కీలక నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( MLA Vasantha Prasad ) కూడా ఇదే బాటలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆయన కూడా అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తునే ఉన్నారు. తాజాగా వైసీపీ హై కమాండ్‌పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( MLA Vasantha Prasad ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేల ఎదురు చూపులు
ఎప్పుడు చీకటి పడుతుందా.. ఎప్పుడు తెల్లరుతుందా అని ఎదురు చూడటమే శాసన సభ్యుల పనిగా మారిందని కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని అన్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీ మారతారనే ప్రచారం వైసీపీలో జోరుగా జరుగుతోంది. నాలుగున్నారేళ్లు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వైసీపీలో చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకున్నారని హై కమాండ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్తు ఏమిటి అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల పెండింగ్‌తో కాంట్రాక్టర్లు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే పార్టీ మార్పు ప్రచారానికి ఈ వ్యాఖ్యలు ఊతమిచ్చినట్లుగా కనిపిస్తున్నాయి.