Andhra Pradesh: ఫస్ట్ మీటింగ్‌లోనే ఫుల్ క్లారిటీ.. విజన్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్..
ABN , Publish Date - Aug 05 , 2024 | 03:36 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన విజన్‌ను కలెక్టర్ల సదస్సులో చెప్పేశారు. మంత్రివర్గం కూర్పునకు ముందు అందరూ పవన్ కళ్యాణ్‌కు హోంశాఖ కేటాయిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన విజన్‌ను కలెక్టర్ల సదస్సులో చెప్పేశారు. మంత్రివర్గం కూర్పునకు ముందు అందరూ పవన్ కళ్యాణ్‌కు హోంశాఖ కేటాయిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ తాను ఏరికోరి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖలను తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో బయటపడింది. గ్రామాల అభివృద్ధి ఎంత అవసరం.. పట్టణాలు, నగరాలతో పాటు గ్రామాలను ఏవిధంగా తీర్చిదిద్దాలనే విషయంలో పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు ఈ కాన్ఫరెన్స్ ద్వారా తెలిసింది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి.. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో పవన్ కళ్యాణ్ పూసగుచ్చినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలనేదానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అధికారులు ఏ విధంగా ముందుకెళ్లాలి.. తాను నిర్వర్తిస్తున్న శాఖలకు సంబంధించిన ప్రాధాన్యతలను తెలిపారు. గతంలో అధికారుల పనితీరు, ప్రభుత్వం ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ ఓ రోల్ మోడల్‌గా ఉండేదని.. కానీ గత ఐదేళ్లూ ఎలా ఉండకూడదో అనే దానికి ఆంధ్రప్రదేశ్‌ను ఉదాహరణగా తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీలో పనిచేయాలంటే గతంలో సివిల్ సర్వెంట్ అధికారులు పోటీపడేవారని, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటూ కొందరు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే అధికారుల పనితీరుపై తనకు విశ్వాసం ఉందని.. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ అధికారులకు చెప్పారు.
CM Chandrababu: పవన్‌కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు
గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి..
గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే విషయంలో అధికారులకు కీలక సూచనలు చేశారు. గతంలో ఏ ఒక్కరూ చేయని విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదానిపైనే ఫోకస్ చేశారు. ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందిచడం, గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం, ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవడంపై పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. తమవైపు నుంచి ఎవైనా తప్పులుంటే వెంటనే సరిదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పారు. అదే సమయంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని చెప్పారు. తనకు పరిపాలనా అనుభవం లేకపోయినప్పటవికీ సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న చంద్రబాబును చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పడం ద్వారా పరోక్షంగా అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేసినట్లైంది. అధికారులు తాము ఐఎఎస్, ఐపీఎస్‌లం కాబట్టి.. అన్ని విషయాలు తమకు తెలుసని భావించవద్దని, ఎప్పటికప్పుడు సీనియర్లు, అనుభవజ్ఞుల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలనే సందేశాన్నిచ్చారు. కలెక్టర్ల సదస్సులో పవన్ ప్రసంగం విన్న తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పరుగులు పెడతాననని, తనతో పాటు అధికారులు పరుగులు పెట్టాలని పరోక్షంగా చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు.
SupremeCourt: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా
లక్ష్యాలు ఇవే..
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఉపాధి హామీ పథకంపై 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని, దీనికోసం ఐదు కోట్ల 40 లక్షల కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాల్లో రహదారుల రిపేర్లు, కొత్త రహదారుల నిర్మాణంపై తన మంత్రిత్వ శాఖ లక్ష్యాలను పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు.
Ramakrishna: భూ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది...
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News