Share News

AP Govt: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..

ABN , Publish Date - Sep 11 , 2024 | 09:02 PM

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB)ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP govt) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019ఎన్నికల తర్వాత సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..

అమరావతి: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB)ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP govt) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019ఎన్నికల తర్వాత సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన 12జీవోలను రద్దు చేస్తూ తాజాగా సీఎం చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సెబ్ ఏర్పాటుకు ముందు ఎక్సైజ్ శాఖలో 6,274మంది సిబ్బంది ఉండేవారు. వారిలో 70శాతం అంటే 4,393మందిని అప్పటి ప్రభుత్వం సెబ్ విభాగానికి కేటాయించింది. దీంతో వారంతా ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా పని చేస్తున్నారు. తాజా ఉత్తర్వులతో వారంతా రిలీవ్ కానున్నారు.


స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దుకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలపగా.. అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు విడుదల చేశారు. సెబ్ సిబ్బంది, వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులంతా మాతృశాఖల్లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. వీరంతా ఎక్సైజ్‌ కమిషనర్‌ నియంత్రణ, పర్యవేక్షణలో పని చేయనున్నారు. అలాగే ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్‌ అధికారి ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఏర్పాటు కానుంది. సెబ్‌కు కేటాయించిన ఫర్నిచర్, వాహనాలు, కంప్యూటర్లు, అద్దె భవనాలను సైతం ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని ఎన్డీయే సర్కార్ ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

Pawan Kalyan: జలవనరుల సంరక్షణపై రేవంత్ రెడ్డికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి..

High Court: పెనక నేహారెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టులో విచారణ..

Minister Ravindra: వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసింది..

Minister Anagani: ఆ 11సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని ప్రజలు బాధపడుతున్నారు..

Updated Date - Sep 11 , 2024 | 09:04 PM