Share News

AP Govt: అరబిందో సంస్థకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

ABN , Publish Date - Nov 04 , 2024 | 02:58 PM

వైసీపీ హయాంలో అడ్డగోలుగా టెండర్లు దక్కించుకున్న అరబిందో సంస్థ 108, 104, 102 ఉద్యోగులకు నరకం చూపించింది. ఈ మూడు పథకాల కింద వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు, మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేసింది.

AP Govt: అరబిందో సంస్థకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

అమరావతి: 108, 104 వాహనాల సేవల నుంచి అరబిందో సంస్థను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం, సేవల నిర్వహణ సరిగా లేకపోవడం, కనీసం వాహనాల మెయింటెనెన్స్ కూడా చేయకపోవడంతో ఆ సంస్థను 108, 104 సేవల నుంచి తప్పించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ, కొత్తగా బాధ్యతలు అప్పగించేందుకు టెండర్లు పిలవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.


వైసీపీ హయాంలో అడ్డగోలుగా టెండర్లు దక్కించుకున్న అరబిందో సంస్థ 108, 104, 102 ఉద్యోగులకు నరకం చూపించింది. ఈ మూడు పథకాల కింద వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు, మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేసింది. అలాగే కొన్నేళ్లుగా వారికి వివిధ అలవెన్సుల కింద చెల్లించాల్సిన రూ.50 కోట్లను సైతం అరబిందో సంస్థ నిలిపివేసింది. దీంతో ఉద్యోగులంతా ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. తమకు రావాల్సిన జీతం, అలవెన్సులు చెల్లించాలని రోడ్డెక్కారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌(102) ఉద్యోగులు ఇప్పటికే నిరసనలు చేస్తుండగా.. 108, 104 ఉద్యోగులూ తాజాగా ఆ సంస్థకు నిరసన నోటీసులు అందించారు.


అయితే 108, 104సేవల నుంచి తాము తప్పుకుంటామని అరబిందో సంస్థ 40 రోజులు క్రితమే ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవోకు లేఖ రాసింది. సబ్ కాంట్రాక్టును జీవీ కంపెనీ, యునైటెడ్‌ బి హెల్త్‌కేర్‌ సంస్థలకు ఇవ్వాలంటూ లేఖలో ఏపీ ప్రభుత్వానికి ఉచిత సలహా కూడా ఇచ్చింది. అయితే ఆ రెండు సంస్థలు అరబిందోకు చెందినవేనని తెలుస్తోంది. సర్వీసులను మెరుగుపరిచేందుకు సబ్ కాంట్రాక్టులను వారికే ఇవ్వాలంటూ అరబిందో సంస్థ లేఖలో బిల్డప్ ఇచ్చింది. తిరిగి తమ సంస్థలకే 108, 104 పనులు దక్కేలా పథకం వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ లేఖను ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పంపలేదు. అరబిందో సంస్థతో చాలా మంది ఆరోగ్య శాఖ అధికారులకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. దీని వల్ల వారు ఆ సంస్థపై అలవిమాలిన ప్రేమ కనబరిచారు.


దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఈ మేరకు స్పందించిన ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే అరబిందో కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి:

Venkaiah Naidu: తాను ప్రస్తుతం ఏ పదవిలో లేను.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: ఇలా చేస్తే నేనే హోం మంత్రిని అవుతా.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Nov 04 , 2024 | 04:40 PM