Share News

BJP: తిరుమల కల్తీ లడ్డూ తయారీ వెనక వారి హస్తం ఉందంటూ..

ABN , Publish Date - Sep 20 , 2024 | 12:46 PM

Andhrapradesh: ఈవో ధర్మారెడ్డి పాలనలోనే కల్తీ నెయ్యి తిరుపతి ప్రసాదం తయారీలో వాడారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. ఆయన కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించానని చెప్పారని.. మరి ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని ప్రశ్నించారు.

BJP: తిరుమల కల్తీ లడ్డూ  తయారీ వెనక  వారి హస్తం ఉందంటూ..
BJP Leader Nagothu Ramesh Naidu

గుంటూరు, సెప్టెంబర్ 20: తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు (BJP Leader Nagothu Ramesh Naidu) స్పందించారు. గత ప్రభుత్వంలో ఆలయాల్లో అపచార కార్యక్రమాలు జరిగాయని వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈవో ధర్మారెడ్డి పాలనలోనే కల్తీ నెయ్యి తిరుపతి ప్రసాదం తయారీలో వాడారన్నారు. ఆయన కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించానని చెప్పారని.. మరి ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని ప్రశ్నించారు.

Note for Vote Case: ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట


ప్రసాదం తయారీలో జరుగుతున్న తప్పుడు విధానాల వెనుక అంతర్జాతీయ క్రైస్తవుల హస్తం ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆల్ఫా అనే సంస్థకు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు... ఎంతకు ఇచ్చారు.. వంటి విషయాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ ఇప్పటి వరకూ ధర్మపత్నితో కలిసి స్వామి వారిని దర్శించుకోలేదన్నారు. హిందువుల మనోభావాలతో ఎవరూ ఆడుకోవద్దని హెచ్చరించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలన జరుగుతుందన్నారు. జగన్ వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. ఏపీని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని బీజేపీ నేత నాగోతు రమేష్ స్పష్టం చేశారు.

Tirupati Laddu: తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై స్పందించిన రమణదీక్షితులు


హైకోర్టుకు..

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తిరుమల లడ్డూ వ్యవహారం హైకోర్టుకు (AP HighCourt) చేరింది. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో దుష్ర్పచారం జరుగుతోందంటూ హైకోర్టును ఏపీ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆశ్రయించారు. ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు, చేప నూనె వాడారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలన్నారు. దీనిపై హైకోర్ట్ కమిటీ వేసి విచారించాలని ధర్మాసనాన్ని సుధాకర్ రెడ్డి కోరారు. అయితే ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. వచ్చే బుధవారం విచారిస్తామని హైకోర్టు చెప్పింది.


ఇవి కూడా చదవండి..

Tirumala laddu: తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు

IdhiManchiPrabhutvam: 100 రోజులు పూర్తి.. నేటి నుంచి 26 వరకు ప్రజల్లోకి...

Read LatestAP NewsANdTelugu News

Updated Date - Sep 20 , 2024 | 01:10 PM