Bonda Uma: సీఎం జగన్ తన ఓటమిని ఒప్పుకున్నాడు
ABN , Publish Date - Jan 25 , 2024 | 10:34 PM
సీఎం జగన్ తన ఓటమిని ఒప్పుకున్నాడని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు (Bonda Umamaheswara Rao) వ్యాఖ్యానించారు.
అమరావతి: సీఎం జగన్ తన ఓటమిని ఒప్పుకున్నాడని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు (Bonda Umamaheswara Rao) వ్యాఖ్యానించారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అన్ని ప్యాక్‌ల సర్వేలన్నీ జగన్‌కు వ్యతిరేకంగా వస్తున్నాయని చెప్పారు. ఏపీలో వైసీపీ కధ ముగిసిందని తెలిపారు. అధికారులు ఒకసారి ఆలోచన చేయాలని సూచించారు. తాడేపల్లి ఆదేశాలు అమలు చేసిన అధికారులు తమ పద్ధతిని మార్చుకోవాలన్నారు. రాబోయేది జనసేన, టీడీపీ ప్రభుత్వం అని స్పష్టంచేశారు. చట్టభద్ధంగా తాము పని చేస్తామన్నారు. అతి వ్యవహారాలు చేస్తే చట్టానికి ఎవరూ అతీతులు కాదని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మారిస్తే గెలుస్తారా అని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్‌కు వచ్చిన వైసీపీ అభ్యర్థి రౌడీ షీటర్లను వెంట పెట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నాడని ఆరోపించారు. అసాంఘిక శక్తులు నియోజకవర్గంలో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని బోండా ఉమామహేశ్వర రావు నిలదీశారు.
సెంట్రల్ వైసీపీ అభ్యర్థి ఒక కామెడీ పీస్‌లా మారాడని ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా ఉండే సెంట్రల్ నియోజకవర్గం లో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. పోలీసులు కంట్రోల్ చేయకపోతే తామే ఆ పని చేస్తామని చెప్పారు. అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు పాలకులకు జీ హుజూరు అంటున్నారన్నారు. వైసీపీ బ్యానర్ పక్కన టీడీపీ బ్యానర్ ఉండకూడదా అని నిలదీశారు. నగరంలో ఆరు రోజులుగా తాగునీటి సమస్య ఉంటే అధికారులు పట్టించుకోరన్నారు. మునిసిపల్ అధికారులు, పోలీసులు, టీడీపీ బ్యానర్లు తొలగించే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలకులు చెప్పారని ఇష్టానుసారంగా వ్యవహారిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పాలకుల చేతుల్లో అధికారులు కీలు బొమ్మలుగా మారొద్దని బోండా ఉమామహేశ్వర రావు సూచించారు.