Share News

Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 18 , 2024 | 09:31 PM

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లై పెంచాలని, సరైన సమయంలో సప్లై అందించాలని కోరారు.

Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

అమరావతి: సబ్సిడీ సరుకులను అందజేయడానికి సహకరించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ఇవాళ(శుక్రవారం) సివిల్ సప్లయ్స్ భవనంలో వంటనూనె దిగుమతిదారులు, కందిపప్పు సరఫరాదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించిందని అన్నారు.


పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట నూనెను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా పామాయిల్ లీటరు రూ. 110. సన్‌ప్లవర్ ఆయిల్ రూ. 124 ధరల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రజల నుంచి సబ్సిడీ వంట నూనెకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. దీంతో సప్లైకి దిగుమతి దారుల నుంచి ఇబ్బందులు లేకుండా సప్లై పెంచడం కోసం ఈ సమావేశం నిర్వహించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.


కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లై పెంచాలని, సరైన సమయంలో సప్లై అందించాలని కోరారు. కందిపప్పు సరఫరాదారులతో మాట్లాడారు. మార్కెట్ ధరలకు కందిపప్పు కొనుగోలు చేసి సబ్సిడీ ధరలపై పేదప్రజలకు కందిపప్పు సరఫరా చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.


సరఫరా దారులు ప్రజలకు సహకరించాలని మంత్రిమనోహర్ కోరారు. టెండర్‎లో పేర్కొన్న విధంగా పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా చేయాలని ఆదేశించారు. నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయకపొతే చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నష్టాన్ని భరిస్తూ సబ్సిడీపై కందిపప్పు అందించాలనే ఆశయంతో పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

AP News: భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

Lokesh: ఆ ఖర్చును నా ఖాతాలో వేస్తారా: నారా లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 09:34 PM