Share News

CM Chandrababu: కలెక్టర్లు అలా చేస్తే మంచిది కాదు... సీఎం చంద్రబాబు సీరియస్

ABN , Publish Date - Dec 12 , 2024 | 10:39 AM

కలెక్టర్లు, ఎస్పీలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెండో రోజు సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.

CM Chandrababu:  కలెక్టర్లు అలా చేస్తే మంచిది కాదు... సీఎం చంద్రబాబు సీరియస్

అమరావతి: కలెక్టర్లు విధుల్లో ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. రెండో రోజు గురువారం వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు (Collectors), ఎస్పీ (SPs)లతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకువచ్చిన పాలసీలు, వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.


ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌సైట్, హౌస్, పవర్ , గ్యాస్, ట్యాప్ వాటర్ ఇవి కనీస అవసరాలు నగరాల్లో, గ్రామాల్లో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్పన్‌లకు , సెమి ఆర్పన్‌లకు పెన్షన్ పెంచాలని కలెక్టర్‌లను ఆదేశించారు. తల్లిదండ్రులు చనిపోయిన ప్యామీలీలకు పెన్షన్ ఇవ్వాలని సూచించారు. అలాగే రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగిన సదస్సులో అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రెండో రోజు హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.


ఎందుకు బిల్లులు చెల్లించరు...

‘‘దావోస్‌లో అయితే ఎవ్వరైనా 2 నిముషాల్లో బెల్ కొడతారు. అనవసరంగా మీటింగ్‌ను ల్యాగ్ చెయొద్దు. చెప్పదలచుకున్నది కాపీల రూపంలో కలెక్టర్‌లకు ఇవ్వండి..వారు చదువుకుంటారు... మేము చేసిన పాలసీలను తర్వాత నేను చదువుకుంటా. లెర్నింగ్ ఓ కంటిన్యూషన్ ప్రాసెస్. నరేగా ద్వారా మనీ వస్తుంది... ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రాం. 100 రోజుల పనిదినాన్ని సరిగా నడిపితే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. పనిదినాలు, మెటీరియల్ కాంపోనెంట్‌ను మీరు పూర్తిచేయలేకపోతున్నారు. పల్లె పండుగలో 14.8 శాతం మాత్రమే చేశారు. ఇంకా నెలన్నరే సమయం ఉంది. ఏఎస్ఆర్ జిల్లా 54శాతం పూర్తి చేశారు. మరోజిల్లాలో 1.6శాతం ఎందుకు వస్తుంది. పని అయిపోతే వెంటనే బిల్లు ఎందుకు పే చేయడం లేదు. క్యాటిల్ షెడ్ 9.6శాతమే చేశారు. కలెక్టర్‌లు ఎందుకు ఫోకస్ చేయడంలేదు. కొన్నిశాఖల్లో డబ్బులు ఉండటం లేదు. మీ వద్ద డబ్బులు ఉన్నా ఎందుకు బిల్లులు చెల్లించరు అంటూ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జలజీవన్ మిషన్‌ను జగన్ ప్రభుత్వం మొత్తం దెబ్బతీసింది. ఇంటర్నల్ రోడ్లు నిర్మాణం అన్ని తిరిగి ప్రారంభించాం. గ్రామాల్లో కనీస అవసరాలు కల్పించాలి’’ అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Google: ఏపీకి గూగుల్‌

YSRCP: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి జంప్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 12 , 2024 | 12:50 PM