Share News

CM Chandrababu: జెస్సీరాజ్ క్రీడలకు గౌరవం తెచ్చారు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

ABN , Publish Date - Dec 21 , 2024 | 09:17 AM

మంగళగిరికి చెందిన స్కేటర్ జెస్సీరాజ్‌పై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. తొమ్మిదేళ్లకే క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించిన జెస్సీరాజ్‌కు క్రీడల పట్ల ఉన్న అంకిత భావం ఈ గౌరవాన్ని తెచ్చిందని అభినందించారు.

CM Chandrababu: జెస్సీరాజ్ క్రీడలకు గౌరవం తెచ్చారు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

అమరావతి: మంగళగిరికి చెందిన స్కేటర్ జెస్సీరాజ్ మాత్రపు ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు 2025కు ఎంపికైంది. జెస్సీరాజ్ ఎంపికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించారు. క్రీడారంగంలో ఆమె సాధించిన అద్భుత ప్రతిభకు దక్కిన గౌరవం ఇదని ప్రశంసించారు. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకుంటారని తెలిపారు. తొమ్మిదేళ్లకే క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించిన జెస్సీరాజ్‌కు క్రీడల పట్ల ఉన్న అంకిత భావం ఈ గౌరవాన్ని తెచ్చిందని అభినందించారు. అటు రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు ఆమె ఆదర్శం కానుందని తెలిపారు. 62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్‌ను ఆమె సాధించిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.


జెస్సీ రాజ్ ఉన్నత స్థాయికి చేరుకోవాలి: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Mandipalli-Ramprasad-Reddy.jpg

స్కేటింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జెస్సీరాజ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. ఈ నెల 26న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా మాత్రపు జెస్సీ‌రాజ్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకోనున్నారని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాల్ పురస్కార్-2025ను జెస్సీరాజ్‌ తీసుకోనున్నారని చెప్పారు. జెస్సీ‌రాజ్ కృషికి, అంకితభావానికి ఆమె సాధించిన ఘనత పట్ల మంత్రి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జెస్సీరాజ్‌ ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆ దిశగా ఆమెకు ప్రభుత్వం నుంచి మద్దతుగా నిలుస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu : ధాన్యం సేకరణలో తప్పులు జరగొద్దు

YS Sharmila : వారే కొట్టుకుని.. రాహుల్‌ను అంటున్నారు

AP High Court : మధ్యవర్తిత్వంపై హైకోర్టులో ముగిసిన శిక్షణ

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 21 , 2024 | 10:22 AM