Share News

CM Chandrababu: దండి కుటీర్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 16 , 2024 | 10:37 PM

గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం) సందర్శించారు.

CM Chandrababu: దండి కుటీర్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

అమరావతి: గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈరోజు(సోమవారం) సందర్శించారు. సీఎం చంద్రబాబుకు దండి కుటీర్ విశిష్టత గురించి వివరించి, సందర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు.


ALSO READ: Nara Lokesh: జగన్‌కు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈ సందర్భంగా మహాత్మా గాంధీకి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్‌లోని గాంధీనగర్‌కు సీఎం చంద్రబాబు వెళ్లిన విషక్ష్ం తెలిసిందే. మహాత్మా గాంధీ జీవిత విశేషాలను అత్యాధునిక టెక్నాలజీతో, అరుదైన చిత్రాలతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాలను సీఎం చంద్రబాబు రాశారు. చర్చించారు.


ALSO READ: AP Govt: మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పవన్‌ అభినందనలు

దండి కుటీర్ సందర్శన తన జీవితంలో మరపురాని ఘటంగా గుర్తుండి పోతుందని చంద్రబాబు అన్నారు. గాంధీజీ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా దండికుటీర్ ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం సీఎం చంద్రబాబు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో తేనేటి విందుకు హాజరయ్యారు.


భారతదేశపు రాజకీయాల్లో విజనరీ లీడర్‌గా, అభివృద్ధి పాలకుడిగా చంద్రబాబు తనకు ఎప్పటి నుంచో స్ఫూర్తిగా ఉన్నారని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కొనియాడారు. భూపేంద్ర పటేల్ ఆతిథ్యానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించి పలు ప్రభుత్వ పాలసీలపై గుజరాత్ సీఎంతో ఏపీ సీఎం చంద్రబాబు


ఈ వార్తలు కూడా చదవండి...

AP News: గుణదల సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో పోడియం తొలగింపు పనులు షురూ...

Narayana: రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు
Prakasam Barrages: పడవల తొలగింపులో కొత్త విధానానికి శ్రీకారం ...

Read LatestAP NewsANDTelugu News

Updated Date - Sep 16 , 2024 | 10:38 PM