TDP: రెండేళ్ల నుంచే టీడీపీని వీడాలన్న ఆలోచనల్లో కేశినేని నానీ: దేవదత్
ABN , Publish Date - Jan 11 , 2024 | 09:45 PM
రెండేళ్ల నుంచే టీడీపీని వీడాలన్న ఆలోచనల్లో మాజీ ఎంపీ కేశినేని నానీ ఉన్నాడని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్ ( Devadat ) అన్నారు.
అమరావతి: రెండేళ్ల నుంచే టీడీపీని వీడాలన్న ఆలోచనల్లో మాజీ ఎంపీ కేశినేని నానీ ఉన్నాడని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్ ( Devadat ) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరువూరులో 7వ తేదీన జరిగిన రా...కదలిరా బహిరంగసభకు నెట్టెం రఘురామ్ ఎంపీ హోదాలో కేశినేని నానీని ఆహ్వానించారని చెప్పారు. సభ సజావుగా జరగకూడదన్న దురుద్దేశంతోనే కేశినేని నానీ వైసీపీ శక్తులతో చేతులు కలిపి పథకం ప్రకారం సభకు అంతరాయం కలిగించారని మండిపడ్డారు. తన అభిమానులను రెచ్చగొట్టి ప్లెక్సీల్లో తన ఫొటో లేదని చెప్పి, వాటిని చించేయించారన్నారు. తనతో సహా, నాయకులంతా పార్టీ నిర్ణయాలకు కట్టుబడ్డామన్న అక్కసుతోనే నానీ సభా ప్రాంగణంలో వీరంగం దేవదత్ వేశారని
చంద్రబాబు సభల్లో కేశినేని నానీ అవాంతరాలు సృష్టించాడు
ఎంపీగా ఉండి వీధి రౌడీలా ప్రవర్తించిన నానీ తీరు దారుణాతి దారుణంగా ఉందన్నారు. దళితుడినైన తనకు కనీస గౌరవం మర్యాద ఇవ్వకుండా నానీ నన్ను ఏకవచనంతో సంబోధించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. తన విషయంలో ప్రోటోకాల్ పాటించలేదంటున్న నానీ, నాకు ఎన్నిసార్లు బహిరంగ సభల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఒక గ్రామ రాజకీయాల్లో కేశినేని నానీ ఆశించింది తాను చేయలేదన్న అక్కసుతో తనపై ఆయన కక్ష పెంచుకున్నారన్నారు. చంద్రబాబు దళితులను ఎంతగా గౌరవిస్తున్నారో చూస్తూ కూడా కేశినేని నానీ దళిత నాయకుడినైన తనపై దురుసుగా వ్యవహరించడం సబబేనా? అని ప్రశ్నించారు. పార్టీకి నష్టం జరుగుతుంది, చంద్రబాబునాయుడికి చెడ్డపేరు వస్తుందనే నానీ నాకు చేసిన అవమానాలను భరించానని తెలిపారు.ఆ క్రమంలోనే టీడీపీ కార్యక్రమాలు సజావుగా జరక్కుండా అడ్డుకున్నాడన్నారు. ఆఖరికి చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో కూడా కేశినేని నానీ అవాంతరాలు సృష్టించాడని మండిపడ్డారు. పచ్చినెత్తురు తాగే జగన్ అని అన్న నానీ, నేడు అదే వ్యక్తితో చేతులు కలిపి తానేమిటో నిరూపించుకున్నాడని దేవదత్ ఎద్దేవా చేశారు.