Dhulipalla Narendra: వైసీపీ దుష్ప్రచారాలపై ఎస్పీకి ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు
ABN , Publish Date - Jan 22 , 2024 | 12:52 PM
Andhrapradesh: సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై ఎస్పీకి టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి ఈ సందర్భంగా టీడీపీ నేత విజ్ఞప్తి చేశారు.
గుంటూరు, జనవరి 22: సోషల్ మీడియాలో వైసీపీ (YCP) చేస్తున్న అసత్య ప్రచారాలపై టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర (TDP Leader Dhulipalla Narendra) జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అనంతరం ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారని.. అదే రోజు సాయంత్రం తన పేరిట తప్పుడు ప్రచారం ప్రారంభించారని ధూలిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. వైసీపీ కీలక నేతల కుట్రతో సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచరులు ఈ ప్రచారం చేశారన్నారు. నరసరావుపేట పల్నాడు న్యూస్ గ్రూప్‌లో ఎమ్మెల్యే గోపిరెడ్డి పీఏ పోస్ట్ చేశారన్నారు. మంత్రి అప్పలరాజు పీఆర్‌ఓ తదితరులు కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారన్నారు. కోనసీమ అల్లర్ల మాదిరిగా గుంటూరు - కృష్ణా జిల్లాలో అల్లర్లు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ఈ అసత్య ప్రచారాలపై పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. తనపై జరుగుతున్న కుట్రపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. అసత్య ప్రచారం వెనుకున్న సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానానికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కుట్ర వెనకున్న అసలు పాత్రధారులు, సుత్రధారులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..