Share News

AP Politics: ఏపీ సర్కార్‌కు డొక్కా రిక్వెస్ట్

ABN , Publish Date - Aug 29 , 2024 | 01:33 PM

సినీ నటి నత్వాని అంశంపై మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. వైసీపీ నేతలు, పోలీసులు ప్రవర్తించిన తీరు హేయనీయం అని మండిపడ్డారు. ముంబై నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేయడం ఏంటీ అని నిలదీశారు. ఆ అమ్మాయి ఆస్తులను రాయించుకొని.. బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు.

AP Politics: ఏపీ సర్కార్‌కు డొక్కా రిక్వెస్ట్
Dokka Manikya Vara Prasad

గుంటూరు జిల్లా: ముంబైకి చెందిన సినీ నటి వేధింపులపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ నేతలు, ఐపీఎస్ అధికారుల పేర్లు బయటకొచ్చాయి. సినీ నటి వేధింపులను అందరూ ఖండిస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం సరికాదని సూచించారు. ఆస్తులు రాయించుకొని, మానసిక క్షోభకు గురిచేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తప్పు చేసిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.


dokka-manikya.jpg


సరికాదు..

సినీ నటి నత్వాని అంశంపై మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. వైసీపీ నేతలు, పోలీసులు ప్రవర్తించిన తీరు హేయనీయం అని మండిపడ్డారు. ముంబై నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేయడం ఏంటీ అని నిలదీశారు. ఆ అమ్మాయి ఆస్తులను రాయించుకొని.. బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో సినీ నటికి వేధింపుల ప్రక్రియ కొనసాగిందని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఐపీఎస్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు.


sajjala.jpg


మనసెలా వచ్చింది..

మహిళపై అనుచితంగా ప్రవర్తించేందుకు వారికి మనసెలా వచ్చిందని డొక్కా నిలదీశారు. సజ్జలను ఆయన సతీమణి ఆరు నెలలు వదిలి వేయాలని, అప్పుడు అయినా ఆయనకు చేసింది తప్పు అని తెలిసే అవకాశం ఉందన్నారు. ఐపీఎస్ అధికారులతో కూడా వారి భార్యలు ఇదే విధంగా ప్రవర్తించాలని సూచించారు. చట్ట ప్రకారంగా కూడా శిక్షించాలని డొక్కా కోరారు. ఇలాంటి తప్పు చేసేందుకు మరొకరు భయపడాలన్నారు.


CM-chandrababu.jpg


చేరికలు కంటిన్యూ

వైసీపీలో చేరికలు ఆరంభం మాత్రమేనని డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయ పడ్డారు. మోపిదేవి వెంకట రమణ బీద మస్తాన్ రావుకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నానని ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రతికించాలంటే వైసీపీకి దూరం కావాల్సిందేనని స్పష్టం చేశారు. వైసీసీ కండువాలు వేసుకొని గత ఐదేళ్లు అరాచకాలు చేసిన ఐపీఎస్ అధికారులకు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.

Updated Date - Aug 29 , 2024 | 01:59 PM