Jogi Ramesh: అయ్యన్న భాషకు మనస్తాపం చెందా... అందుకే
ABN , Publish Date - Aug 16 , 2024 | 03:15 PM
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడిన భాషకి మనస్తాపం చెందానని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అసభ్యంగా మాట్లాడటం సమంజసంగా లేదన్నారు. ఈ కారణంతోనే చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపానని వివరణ ఇచ్చారు.
గుంటూరు, ఆగస్టు 16: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై (Former CM YS Jagan Reddy) ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడిన భాషకు మనస్తాపం చెందానని మాజీ మంత్రి జోగి రమేష్ (Former Minister Jogi Ramesh) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అసభ్యంగా మాట్లాడటం సమంజసంగా లేదన్నారు. ఈ కారణంతోనే చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపానని వివరణ ఇచ్చారు. ఆ కేసు విషయంలోనేలో పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని... పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చానన్నారు.
KTR: కొడంగల్ రైతులను అడుగుదాం పదా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్
నోటిఫికేషన్ ఇచ్చిన భూమి మాత్రమే తన కుమారుడు కొనుగోలు చేశారన్నారు. పదవులు రానివారు పదవుల కోసం తనను తిడున్నారని మండిపడ్డారు. ‘‘ఏదైనా కక్ష ఉంటే నాపై చూపించుకోండి. పిల్లల జోలికి ఎందుకు..? నేను ఎటువంటి తప్పు చేయలేదు’’ అని స్పష్టం చేశారు. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అవసరమన్నారు. పరుష పదజాలం తాము ఉపయోగిస్తే ప్రజలు ఎలాంటి తీర్చు ఇచ్చారో చూస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు వెళ్తే తప్పకుండా ఇలాంటి తీర్పుని ఎదుర్కోవాల్సిందే అని హెచ్చరించారు. తప్పకుండా చరిత్ర పునరావృతం అవుతుందన్నారు. న్యాయపరంగా ఈ కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జోగి రమేష్ వెల్లడించారు.
Viral Video: Viral Video: ఎలన్ మస్క్ వీడియో.. నెట్టింట రచ్చ రచ్చ..!
కాగా.. ఈరోజు మంగళగిరి రూరల్ స్టేషన్‌కు జోగి రమేష్ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పై దాడి కేసులో జోగిని విచారణ నిమిత్తం పోలీసులు పిలిచారు. నాలుగు రోజుల నుంచి వాయిదాలు వేస్తున్న రమేష్.. ఈ రోజు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
Gadde Rammohan: జగన్ పేదల నోటి వద్ద కూడా తీసేశారు.. ఎమ్మెల్యే ఫైర్
Devineni Avinash: దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ యత్నం!.. చివరి నిమిషంలో
Read Latest AP News And Telugu News