Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. గుడ్డు నుంచి నాగుపాము బయటకు రావడం ఎప్పుడైనా చూశారా?

ABN , Publish Date - Aug 16 , 2024 | 01:57 PM

మనం కుక్కలు, ఆవులు, గేదెలు పుట్టడం చూసుంటాం. గుడ్ల నుంచి కోడి పిల్లలు, ఇతర పక్షి జాతి పిల్లలు బయటకు రావడం చూసుంటాం. కానీ, గుడ్డు నుంచి పాము పిల్ల బయటకు రావడం మీరెప్పుడైనా చూశారా?

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. గుడ్డు నుంచి నాగుపాము బయటకు రావడం ఎప్పుడైనా చూశారా?
The birth of a baby cobra

మనం కుక్కలు, ఆవులు, గేదెలు పుట్టడం చూసుంటాం. గుడ్ల నుంచి కోడి పిల్లలు, ఇతర పక్షి జాతి పిల్లలు బయటకు రావడం చూసుంటాం. కానీ, గుడ్డు (Egg) నుంచి పాము పిల్ల (Birth of a snake) బయటకు రావడం మీరెప్పుడైనా చూశారా? నాగుపాము పిల్ల గుడ్డును పగలగొట్టుకుని బయటకు వస్తున్న ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. @AMAZlNGNATURE అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న వీడియోలోని ఓ వ్యక్తి తన చేతిలో కింగ్ కోబ్రా గుడ్డును పట్టుకుని ఉన్నాడు. ఆ గుడ్డు లోపలి నుంచి ఓ చిన్న పాము పిల్ల బయటకు వస్తోంది. ఆ చిన్న నాగుపాము గుడ్డు నుంచి బయటకు వస్తూ తన నాలుకను వేగంగా కదుపుతోంది. అప్పుడు బయటకు వస్తున్న ఆ చిన్న పాము శరీరం వణుకుతోంది. ఈ నాగుపాము 18 అడుగుల పొడవ వరకు పెరుగుతుంది. దీని విషం అత్యంత ప్రమాదకరమైనది. ఈ కింగ్ కోబ్రాలు ఏనుగును కూడా చంపగలవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 66 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 47 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అద్భుతమైన వీడియో``, ``అది ఎంత పొడవు వరకు పెరుగుతుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది``, ``అత్యంత విషపూరితమైన సర్పం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వడగళ్ల వానకు భయపడ్డ పక్షి.. ఓ ఇంటి డోర్ ముందు నిల్చుని ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!


Viral Video: ఖరీదైన కారుతో సెల్ఫీ దిగిన బుడగలమ్మే వ్యక్తి.. యజమాని వచ్చి ఏం చేశాడో చూస్తే కళ్లు చెమర్చక మానవు..!


Viral: రాఖీ పండుగకు సెలవు అడిగితే ఉన్న ఉద్యోగం ఊడింది.. కంపెనీ చెప్పిన కారణం ఏంటంటే..


Picture Puzzle: మీ మెదడుకు పదును పెట్టండి.. ఈ ఫొటోలోని ఆరు ఆంగ్ల పదాలను 15 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2024 | 01:58 PM