Share News

CM Chandrababu: చంద్రబాబు నివాసం దగ్గర భద్రతపై జీవో విడుదల

ABN , Publish Date - Oct 28 , 2024 | 08:55 PM

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భద్రతపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీలోని చంద్రబాబు నివాసం దగ్గర భద్రత, ఇతర వసతుల కోసం నిధుల విడుదలకు జీవో జారీ అయింది.

CM Chandrababu: చంద్రబాబు నివాసం దగ్గర భద్రతపై జీవో విడుదల

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భద్రతపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీలోని చంద్రబాబు నివాసం దగ్గర భద్రత, ఇతర వసతుల కోసం నిధుల విడుదలకు జీవో జారీ అయింది. రూ.1.44కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తుంది. రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.21లక్షలు, నిఘా కోసం రూ.81లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. సీఎం ఇంటికి వచ్చే వాహనాల తనిఖీలు, నియంత్రణ, యూవీఎస్‌ఎస్, హైడ్రాలిక్ బోలార్డ్స్ కోసం రూ.42లక్షలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది.


కృష్ణా నది ఒడ్డున చంద్రబాబు నివాసం..

రాజధాని అమరావతి కిందకు వచ్చే ప్రాంతంలో ఏపీ సచివాలయానికి వెళ్లే దారిలో కృష్ణా నది ఒడ్డున చంద్రబాబు నివాసం ఉంది. హైదరాబాద్‌లోగానీ, అమరావతిలోగానీ ఎప్పుడూ చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నాలు జరగలేదు. రాజకీయ విభేదాలు తీవ్రంగా ఉన్నప్పుడూ, తెలంగాణ ఉద్యమం వేడిగా ఉన్న సమయంలోనూ దాడులు జరగలేదు. జగన్ ప్రభుత్వం సమయంలో చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీని దృష్ట్యా చంద్రబాబు భద్రతపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.


ప్రత్యేక ఏర్పాట్లు..

కాగా గతంలో చంద్రబాబు నివాసం వద్దకు వైసీపీ కార్యకర్తలు రాగానే ఆయన భద్రతకు నియమితులైన ఎన్‌ఎస్‌జీ కమెండోలు అప్రమత్తమయ్యారు. అయితే సీఎం అయిన తర్వాత మరింత పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Bomb Threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో విమానానికి..

AP Govt: ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో కీలక నిర్ణయం .. నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు

Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2024 | 10:06 PM