Share News

CM Chandrababu: జగన్ - షర్మిల ఆస్తి వివాదం.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 24 , 2024 | 05:55 PM

జగన్ షర్మిల ఆస్తి వివాదంపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే తమను అందులోకి లాగుతున్నారని ధ్వజమెత్తారు. విలువలు లేని రాజకీయం చేసి, హీరోయిజం చేయాలనుకుంటే ఇక మీదట కుదరదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

CM Chandrababu:  జగన్ - షర్మిల ఆస్తి వివాదం.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. జగన్, షర్మిల ఆస్తి వివాదంపై ఆయన మాట్లాడుతూ.. 2004లో వందల కోట్లుగా ఉన్న సంపాదన ప్రస్తుతం లక్షల కోట్లకు చేరుకుందని.. అదంతా ఎలా వచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కనీస విలువలు పాటించని ఇలాంటి వ్యక్తితో రాజకీయం చేయాలంటే తనకు సిగ్గుగా ఉందన్నారు. తల్లి, సోదరిని కోర్టుకీడ్చిన జగన్.. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.


విలువలు లేని మనుషులు...

"విలువలు లేని మనుషులు సమాజానికి చేటు. ప్రభుత్వంలో ఉండగా పేదలకు ఎన్నడైనా సాయం చేశారా. ఇప్పుడేమో వైసీపీ తరఫున రూ.10 లక్షలు ఇస్తామంటున్నారు. జగన్ దగ్గర ఉన్న అవినీతి సొమ్ము అలాగైనా పేదలకు చేరుతుంది. ప్రతిపక్షంలో ఉండగా.. నన్ను 5 ఏళ్లపాటు ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. ఇప్పుడు వారిని ఆపాలంటే నిమిషం కాదు. విలువలు లేని రాజకీయం చేసి, హీరోయిజం చేయాలనుకుంటే ఇక మీద కుదరదు" అని బాబు స్పష్టం చేశారు.

ys-sharmila-ys-jagan.jpg


జాతీయ రహదారులపైనా రివ్యూ...

ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి రైల్వే ప్రాజెక్టులు ప్రకటిస్తుంటే.. ఈరోజు జాతీయ రహదారులపైనా తాను రివ్యూ చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు నాలుగు నుంచి 6 లైన్ల రహదారిగా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్ అండ్‌బీసీఎల్‌ఆర్, సీసీఎల్‌ఏ , అటవీ ఇతర శాఖలతో ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో అన్ని రంగాలు బూస్టప్ అవుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

cbn.jpg


9987కిలోమీటర్ల జాతీయ రహదారులు ఏపీలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫోర్ లైన్‌వి ఎక్కువగా ఉన్నాయని సిక్స్ లైన్ రహదారులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇకపై వీలయినంత వరకూ కోల్‌కతా నుంచి ఇచ్చాపురం వరకూ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. నరసన్నపేట నుంచి రణస్థలం వరకు ఆరు లైన్ల రహదారి ఉందని గుర్తుచేశారు. ఇప్పుడు రణస్థలం నుంచి శ్రీకాకుళానికి 6 లైన్లకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. కొన్నిరోడ్లను చాలా కారణాలతో నిలిపివేసిందని అన్నారు. ఫారెస్టు క్లియరెన్స్‌తోపాటు వేర్వేరు ప్రాజెక్టుల కింద 17 రహదారులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించారు. జగన్ ప్రభుత్వంలో కేవలం 2 రహదారులు మాత్రమే పూర్తిచేసిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఇప్పుడు రాష్ట్రంలో 95 ప్రాజెక్టులకు చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్లు, రాష్ట్రప్రభుత్వ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అధికారులు కీలక విషయాలను తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రూ. 18000 కోట్లతో పనులన్నీ పూర్తిచేయాలని కోరామని అన్నారు. ఈ పనులు త్వరగా పూర్తి అవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు.


గ్రీన్ హైడ్రోజన్ హబ్‌..

హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు అనుసంధానం చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవేను ఏర్పాటు చేయాలని అన్నారు. ఏపీలో చాలా పోర్టులు ఉండటంతో రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. నేషనల్‌ హైవే కనెక్టివిటీ‌తో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తయరవుతుందని తెలిపారు. రూ. 70వేల కోట్ల పనులు రైల్వే శాఖలో ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడి పనులు అక్కడే ఆపివేశారని మండిపడ్డారు. ఈజ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌ను.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా కూటమి ప్రభుత్వంలో మార్చామని అన్నారు. పరిటాల దగ్గర మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటవుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

chandrababu.jpg


నిర్మాణాల్లో వేగం...

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 14శాతం నుంచి 8శాతానికి లాజిస్టిక్ కాస్ట్ తగ్గాలని అన్నారు. ఏపీలో ఉచితంగా ఇసుక ఇస్తుండటంతో నిర్మాణాల్లో వేగం పుంజుకుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పలు శాఖల్లో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు.


తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు...

‘‘నిర్మాణ కంపెనీల నిర్వాహకులే నదిలోకి వెళ్లి తవ్వుకునే అవకాశం కల్పిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం గతంలో ఇలాంటి పనులు చేయడం మరిచిపోయింది. జగన్ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి చాలా మందిని ఇబ్బంది పెట్టారు. అమరావతి నుంచి అనంతపూర్ వరకు ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చేశారు. నిజానికి స్ట్రైయిట్ రోడ్డు చేయాలని అనుకున్నామని.. జగన్ ప్రభుత్వంలో మార్చడంతో దానినే ఇప్పుడు వాడుకుంటాం తప్ప విధ్వంసం తమ అభిమతం కాదు. ఈసారి జలాశయాలు పూర్తిగా నిండాయని అన్నారు. చివరకు గండికోట, బ్రహ్మసాగర్ , పులిచింతలలో నీరు పుష్కలంగా ఉంది. ఏపీ అంటే కరవు, తుఫాన్. రాయలసీమ అంటే నీళ్లులేవు, రాళ్లసీమ అని గతంలో అనేవారు. ఇప్పుడు మార్పు వచ్చింది. ఏపీకి బులెట్ ట్రైన్ వస్తే నాలుగు నగరాలకు ఉపయోగంగా ఉంటుంది. 4కోట్ల జనాభాతో గంటన్నర, రెండు గంటల్లోనే తదితర ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు. అప్పుడు విమానంలో, రైల్లో వెళ్లడానికి ఒక్కటే సమయం అవుతుంది’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఆ చీకటి జీవోలపై విచారణ...

‘‘తమిళనాడు కన్నా ఏపీలో డీప్ వాటర్ పోర్టులు చాలా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో జీవోలను దాచిపెట్టి చీకటి జీవోలు ఇచ్చారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉండాలి...ఈ ప్రాథమిక సూత్రాన్ని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఈ ఐదేళ్లు ఇచ్చిన చీకటి జీవోలపై విచారణకు ఆదేశించాం. 31వ తేదీన ఉచితంగా 3 సిలెండర్‌లు ఇస్తున్నాం. 1995-96లో సాధారణ మహిళలకు ఉచితంగా దీపం ఇచ్చాం. ఇప్పుడు వెలుగు ఇస్తున్నాం. అమరావతికి డబ్బులు ఇస్తామంటే వద్దన్నారుగా... ఇప్పుడు రైల్వే ప్రాజెక్టు వచ్చింది. డయా ఫ్రాం వాల్‌ను రూ. 990 కోట్లతో తిరిగి ప్రారంభించాం. కోటి లక్షల టన్నుల చెత్త క్రియేట్ చేస్తే దానిని వెంటనే శుభ్రం చేయాలి. 85లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ గార్బేజ్ మాకు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో చెత్తమీద పన్నువేసి తిరిగి కట్టలేదని.. మళ్లీ వారి షాపులముందు చెత్తవేశారు. ఇలాంటి పార్టీలో ఉండాలంటే అక్కడి నేతలు సిగ్గుపడాలి. కరెంటు లేని పరిస్ధితి నుంచి ఇంటిపై కరెంట్ తయారు చేస్తున్నాం. నేను జగన్ లాంటి నేతలకు సమాధానం చెప్పాలా’’ అని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Home Minister Anitha: ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నదే జగన్ ఆలోచన

Cyclone Dana: దూసుకొస్తున్న దానా తుఫాన్.. అధికారుల హెచ్చరికలు

Diwali: దీపావళి ఎఫెక్ట్.. సొంతూళ్లకు లక్షలాది మంది ప్రయాణం

AP Highcourt: నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 07:32 PM