Share News

AP Govt: రిజిస్ట్రేషన్ చార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Dec 30 , 2024 | 07:03 PM

Anagani Satyaprasad: చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ర్టేషన్ విలువలను తగ్గించబోతున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పెంపుదల గానీ, తగ్గింపు కానీ ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం శాస్ర్తీయ పద్దతిలో కాకుండా ఇష్టానుసారం రిజిస్ర్టేషన్ విలువలను పెంచిందని.. వాటన్నింటినీ సరి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

 AP Govt: రిజిస్ట్రేషన్ చార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Anagani Satyaprasad

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాహిత పాలన కొనసాగుతుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. లక్ష 82 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని చెప్పారు. రెవెన్యూ సదస్సులకు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. గడిచిన ఐదేళ్లు రెవెన్యూ సమస్యలు గాలికి వదలివేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు సరిచేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రోత్ సెంటర్స్ ఆధారంగా చార్జీలు పెరుగుతాయని అన్నారు. మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ చార్జీలు ఎక్కువగా ఉన్నచోట తగ్గిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద 0 నుంచి 20శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు తిరుగుదల ఉంటుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు 0శాతం మాత్రమే ఉన్నాయన్నారు. రూ. 9,500 కోట్లు టార్గెట్ రీచ్ అవుతామని తెలిపారు. గత నెలతో పోల్చితే ఈ నెల రెవెన్యూ పెరిగిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.


రూ. 1.30 వేల కోట్లు విద్యుత్ చార్జీల భారం వైసీపీ ప్రభుత్వం పెంచిందని చెప్పారు. రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ర్టేషన్ విలువలు పెరుగుతున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్ర్టేషన్ విలువలు పెంచుతున్నట్లు చెప్పారు. సగటున 15 శాతం నుంచి 20 శాతం వరకు రిజిస్ర్టేషన్ చార్జీలు పెరుగుతాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జనవరి 15 నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ర్టేషన్ విలువలను తగ్గించబోతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పెంపుదల, తగ్గింపు కానీ ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం శాస్ర్తీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారం రిజిస్ర్టేషన్ విలువలను పెంచిందని.. వాటన్నింటినీ సరి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ గ్రీవెన్సులలో వచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టమని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. నరసరావుపేటలో రూ. 12లక్షలు ఉన్న ల్యాండు ఇవాళ రూ.1.8 కోట్లకు వచ్చింది... దీనిపై మాట్లాడామన్నారు. గ్రోత్ కారిడార్ల ఆధారంగా ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టామన్నారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా భూములను గుర్తిస్తామని తెలిపారు. పది జిల్లాల్లో 50 నుంచి 60 అభ్యంతరాలు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


కమిటీ సిఫారసులు, గ్రోత్ కారిడార్ల అధ్యయనం ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. 200 మంది దాకా డిజిటల్ అసిస్టెంట్‌లను రిజిస్ట్రేషన్ విధానంలో వినియోగిస్తామని అన్నారు. ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రతీ చోటా ఉండేలా చూస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.6200 కోట్లు రెవెన్యూ శాఖలో ఆదాయం ఉందని.. మార్చి నాటికి రూ. 10వేల కోట్లు దాటే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికీ రూ.120 కోట్ల వరకూ రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు వల్లే కరెంటు ఛార్జీలు పెరగడం అని చెప్పారు. 22.4 మిలియన్ యూనిట్ల మిగులును నాశనం చేశారని మండిపడ్డారు. సెప్టెంబర్ నెల తప్ప మిగిలిన నెలల్లో ఎక్కువగానే రిజిస్ట్రేషన్‌లు జరిగాయని చెప్పారు. రీసర్వే వల్ల వచ్చిన నష్టాల పైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. రూ. 198 కోట్లు రీసర్వే ఇన్సెంటివ్ వచ్చింది.. సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో కార్యాలయాల పునరుద్ధరణకు వినియోగిస్తామని తెలిపారు. 596 జీఓ‌తో డీవియేషన్‌లు కొట్టేస్తామని అన్నారు. అధికారి ఎవరు ఏ స్ధాయిలో భూ సమస్యల్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసినా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.1.70 లక్షలు గ్రీవెన్సులు వస్తే 11,340 సమస్యలు పరిష్కరించామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Perni Nani: పేర్ని నాని ఫ్యామిలీకి మళ్లీ నోటీసులు

CP Rajasekhar: వార్షిక నేర సమీక్షను విడుదల చేసిన విజయవాడ సీపీ.. ఏం చెప్పారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 07:11 PM