Share News

Kollu Ravindra: త్వరలోనే ఆ స్కాములను బయట పెడతాం...మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:42 PM

వైసీపీ ప్రభుత్వం జరిగిన స్కాములను త్వరలోనే బయట పెడతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఇప్పటికే 12 సీబీఐ, 9 ఈడీ కేసుల్లో ఉన్న జగన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి లాంటి వారు ఉన్నారని చెప్పారు. వారు చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత లేదని గుర్తుంచుకోవాలని చెప్పారు.

Kollu Ravindra: త్వరలోనే ఆ స్కాములను బయట పెడతాం...మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో అడ్డంగా బుక్కైన విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం మొత్తాన్ని జగన్ రెడ్డి నాశనం చేశారని మండిపడ్డారు. తోడు దొంగలు, జైలు పక్షుల గత ఐదేళ్ల దోపిడీ బయట పడుతుందనే భయంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు.


చంద్రబాబు వయసు గురించి మాట్లాడే ముందు ఆయన రాష్ట్రం కోసం పడుతున్న తాపత్రయం గురించి మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా రోజులో 18 గంటలకు పైగా శ్రమిస్తున్నారన్నారు. యువకుడు అని చెప్పుకునే జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. విజయసాయి సహా వైసీపీ బ్యాచ్ మొత్తానికి ప్రజలే బడితే పూజ చేస్తారని హెచ్చరించారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో కుంభకోణాలు తప్ప ఎక్కడైనా అభివృద్ధి ఉందా అని నిలదీశారు.


రైస్ స్కాం, కాకినాడ పోర్టులో స్కాం బట్టబయలు కావడంతో వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. త్వరలోనే ఆ స్కాములను బయట పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే 12 సీబీఐ, 9 ఈడీ కేసుల్లో ఉన్న జగన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి లాంటి వారు ఉన్నారని చెప్పారు. వారు చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత లేదని గుర్తుంచుకోవాలన్నారు. వాళ్ల అరాచకానికి ప్రతిఫలంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని అన్నారు. లేకుంటే ప్రజలే తన్ని తరిమే రోజులు వస్తాయని హెచ్చరించారు. చంద్రబాబు గురించి మాట్లాడే ముందు విజయ సాయి రెడ్డి తనపై ఉన్న కేసుల గురించి సమాధానం చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

వైసీపీ నేతల్లో ఉలిక్కిపాటు..

భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 04:43 PM