AP Intermediate: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
ABN , Publish Date - Dec 03 , 2024 | 09:43 PM
ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారు దాదాపుగా అందరూ పేద విద్యార్థులే. వారి కుటంబాల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వీరికోసం మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అమరావతి: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వాతావరణంలో మెగా పీటీఎం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచనల మేరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలు చెప్పనుంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి లోకేష్ ఇవాళ(మంగళవారం) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారు దాదాపుగా అందరూ పేద విద్యార్థులే. వారి కుటంబాల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంత్రి నారా లోకేష్ మధ్యాహ్న భోజన పథకంపై కీలక ప్రకటన చేశారు. పాఠశాలలకు అందిస్తున్న విధంగానే ఇంటర్ చదివే విద్యార్థులకు కూడా ప్రభుత్వమే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు.
మధ్యాహ్న భోజనం లేక ఇబ్బందులు
కాగా.. ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి చదువుకోవాలన్న ఆశయంతో ఉదయాన్నే ఇంటి నుంచి కళాశాలలకు వస్తున్నప్పటికీ మధ్యాహ్నం ఆకలి మంటతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో భోజన విరామం తర్వాతి క్లాసులు వినకుండానే చాలామంది ఇళ్లకు వెళ్లిపోతున్నా సందర్భాలు ఉన్నాయి. దీంతో చదువులో విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు పాఠశాలల మాదిరిగా మధ్యాహ్న సమయంలో ఉచితంగా భోజనం అందించాలని ఏపీ ప్రభుత్వం భావించింది.
విద్యాసంస్థలపై భరోసా కల్పించాలా చర్యలు..
తద్వారా సర్కారీ విద్యాసంస్థలపై భరోసా కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యశాఖ అధికారులను సంప్రదించి పథకం అమలుకు సంబంధించిన ఖర్చు, నిర్వహణ బాధ్యతలను ఎవరికి కట్టబెడితే బాగుంటుందనే వివరాలను తెప్పించింది. ఇందులో భాగంగా ఆయా కాలేజీల్లో రోజువారీ భోజనం తయారీ, ఇతర ఖర్చులకు భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఏటా అంత మొత్తాన్ని భరించే పరిస్థితి లేదని భావించిన గత ప్రభుత్వాలు పథకాన్ని పక్కన పెట్టాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోజువారీ భోజనానికి ఎంత ఖర్చవుతుందన్న వివరాలతో ప్రతిపాదనలివ్వాలని అధికారులను కోరారు. కాగా, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. ఫలితంగా హాజరు శాతం పడిపోతోంది.
గురుకుల పాఠశాలలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆకస్మిక తనిఖీ
నెల్లూరు: బోగోలు అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో ఇవాళ(మంగళవారం) మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందికి మంత్రి సూచించారు. గురుకులాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చదువుతోనే సమాజంలో పేదరికం అంతమవుతుందని చెప్పారు. పేదల విద్యకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Payyavula: మా వియ్యంకులు చేసేది ఆ వ్యాపారం మాత్రమే
TDP MLA: ‘చెవిరెడ్డి’ చేసింది తప్పుకాదా.. ప్రతిఒక్కరూ ఆలోచించండి
CM Chandrababu: ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. వాటికి ఆమోదం
Read Latest AP News And Telugu News