Minister Lokesh: ఏపీ యూనివర్సిటీల్లో మెరుగైన విద్యకు మంత్రి లోకేశ్ చర్యలు..
ABN , Publish Date - Aug 13 , 2024 | 07:34 PM
ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యలో మెరుగైన విద్య, ర్యాంకింగ్స్, సంస్కరణల అమలుకు సహాయ, సహకారాలు అందిస్తామని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్(NUS) ప్రొఫెసర్ ఎం.వి.ఆర్.చౌదరి(MVR Chowdary) స్పష్టం చేశారు. ఏపీలో ఉన్నత విద్యారంగంలో సంస్కరణలకు తప్పకుండా తోర్పాటు అందిస్తామని విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేశ్(Minister Lokesh)కు ఆయన హామీ ఇచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యలో మెరుగైన విద్య, ర్యాంకింగ్స్, సంస్కరణల అమలుకు సహాయ, సహకారాలు అందిస్తామని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్(NUS) ప్రొఫెసర్ ఎం.వి.ఆర్.చౌదరి(MVR Chowdary) స్పష్టం చేశారు. ఏపీలో ఉన్నత విద్యారంగంలో సంస్కరణలకు తప్పకుండా తోర్పాటు అందిస్తామని విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేశ్(Minister Lokesh)కు ఆయన హామీ ఇచ్చారు. సోమవారం రోజున నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)–2024లో ఏపీకి చెందిన 31 యూనివర్సిటీలు చోటు సంపాదించాయి.
అయితే వీటిలో మరింత మెరుగైన విద్య అందించేందుకు ఎం.వి.ఆర్. చౌదరితో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల పనితీరు మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై వారిద్దరూ కూలంకశంగా చర్చించారు. రీసెర్చ్, ఇన్నొవేషన్స్‌లో వెనకబడి ఉండటమే ఏపీలో ర్యాంకింగ్స్ తగ్గుదలకు కారణం అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి అవసరమైన పాఠ్యాంశాల మార్పులు, ఇతర విధానాలను విశ్వవిద్యాలయాలతో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రొఫెసర్ చౌదరి వెల్లడించారు. కార్యచరణ అమలుకు త్వరలోనే ప్రణాళిక రూపొందించనున్నట్లు మంత్రి లోకేశ్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP High Court: EWS కోటా మెడికల్ సీట్ల కేటాయింపు జీవో నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు..
Minister Anagani: రౌడీయిజం చేసిన జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారు..