Minister Narayana: రాజధాని అమరావతిపై గత కాంట్రాక్టులు రద్దు చేస్తాం
ABN , Publish Date - Oct 24 , 2024 | 10:05 PM
రాజధాని రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామమని పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చామని తెలిపారు.
అమరావతి: రాజధాని రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామమని పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చామని తెలిపారు. జగన్ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పడేసిందని మండిపడ్డారు. ప్రతీ రాష్ట్ర అభివృద్ధికి వనరులు,మౌళికవసతులు ఎంతో అవసరమని వివరించారు. సీఎం చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడు అని ప్రశంసించారు.
ఎర్రుబాలెం నుంచి నంబూరు వరకూ అమరావతి మీదుగా 57 కిలోమీటర్ల మేర లైన్ 2245 కోట్లతో నిర్మాణం కానుందని తెలిపారు. ఈ రైల్వే లైన్ వల్ల మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కనెక్టివిటీ అవుతుందని చెప్పారు. నాగుగేళ్లలో దీనిని పూర్తి చేస్తామని రైల్వే శాఖ చెపితే.. సీఎం చంద్రబాబు మూడేళ్లలో పూర్తి చేయాలని అడిగారని అన్నారు. అమరావతికి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఒకొక్కటిగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
మాజీ సీఎం జగన్ వల్ల అమరావతి రైతులు పడినన్ని కష్టాలు ఇంకెవరూ పడలేదని చెప్పారు. అందుకే రైతుల సమస్యలపైనే ముందుగా దృష్టి సారించామని అన్నారు. గత కాంట్రాక్టులు అన్నీ మరో పదిహేను రోజుల్లో రద్దు చేసి కొత్తవాటిని పిలుస్తామని స్పష్టం చేశారు.నవంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ చివరిలోగా అన్ని పనులకూ టెండర్లు పూర్తి చేస్తామని వివరించారు. 360 కిమీ ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు,3600 ఫ్లాట్లకు, కొండవీటి,పాలవాగు, గ్రావిటీ కెనాల్, కరకట్ట రోడ్డుకు టెండర్లు పూర్తిచేస్తామని తెలిపారు.
అసెంబ్లీ,హైకోర్టు నిర్మాణానికి జనవరి నెలాఖరుకు టెండర్లు పూర్తి చేస్తామని అన్నారు. సెక్రటేరియట్ భవనాల నిర్మాణానికి డిసెంబర్ నెలాఖరులో టెండర్లు పూర్తి చేస్తామని చెప్పారు. దాచేపల్లిలో డయేరియా నివారణపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. అన్ని బోర్లను మూసివేసి నీటిని పరీక్షలకు పంపించాలని సూచించానని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu: జగన్ - షర్మిల ఆస్తి వివాదం.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
Cyclone Dana: దూసుకొస్తున్న దానా తుఫాన్.. అధికారుల హెచ్చరికలు
Diwali: దీపావళి ఎఫెక్ట్.. సొంతూళ్లకు లక్షలాది మంది ప్రయాణం
AP Highcourt: నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
Read Latest AP News And Telugu News