Share News

Minister Narayana: అమరావతిలోనిర్మాణాలపై మంత్రి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jul 12 , 2024 | 09:29 PM

అమరావతిలో మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టత ఎలా ఉందో తెలుసుకోవడానికి ఐఐటి ఇంజనీర్లతో అధ్యయనం చేయించాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) నిర్ణయం తీసుకున్నారు.

Minister Narayana: అమరావతిలోనిర్మాణాలపై మంత్రి కీలక ఆదేశాలు
Minister Narayana

అమరావతి: అమరావతిలో మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టత ఎలా ఉందో తెలుసుకోవడానికి ఐఐటి ఇంజనీర్లతో అధ్యయనం చేయించాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) నిర్ణయం తీసుకున్నారు. ఐకానిక్ భవనాలు ఫౌండేషన్ పటిష్టత నిర్దారణ కోసం ఐఐటీ చెన్నైకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.


ఈరోజు(శుక్రవారం) అమరావతిలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ... ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్లు పటిష్టత నిర్దారణ బాధ్యతలు ఐఐటీ హైదరాబాద్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఐఐటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా ముందుకెళ్తామని అన్నారు. సీఆర్డీఏకు గతంలో పనిచేసిన 47 మంది కన్సల్టెంట్స్ వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి కన్సల్టెంట్లను నియమించుకోవాలని కోరారు. సీఆర్డీఏకు సిబ్బంది కొరత చాలా ఉందని చెప్పారు. గతంలో ఉన్న సిబ్బందిలో 528 మంది తక్కువగా ఉన్నారని వివరించారు. అమరావతికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైన సీఎం అధ్యక్షతన తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Updated Date - Jul 12 , 2024 | 09:29 PM