Share News

Minister Ramanaidu: స్పోర్ట్స్ పాలసీపై మంత్రి నిమ్మల రామానాయడు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 28 , 2024 | 09:07 PM

Minister Nimmala Ramanaidu: గత ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మంత్రి నిమ్మల రామానాయడు విమర్శించారు. గోదావరి తీర ప్రాంతాలతో పాటు బీచ్‌లు, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయడు పేర్కొన్నారు.

Minister Ramanaidu: స్పోర్ట్స్ పాలసీపై మంత్రి నిమ్మల రామానాయడు  కీలక వ్యాఖ్యలు
Nimmala Rama Naidu

అమరావతి: క్రీడల అభివృద్ధి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చారని మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించలేదని మండిపడ్డారు. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ వైసీపీ నేతలు కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. గత ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. ఏపీ ఆదాయం పెంచేందుకు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. గోదావరి తీర ప్రాంతాలతో పాటు బీచ్‌లు, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయడు పేర్కొన్నారు.


నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తున్నారు: ఎంపీ కేశినేని శివనాథ్

ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌కు సెలెక్ట్ అయిన నితీశ్ కుమార్ రెడ్డికు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు తెలిపారు. ఏసీఏ త‌రుఫున యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి రూ. 25 లక్షల నగదును ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రోత్సాహక నగదు బహుమతిని నితీష్ కుమార్ రెడ్డికి అందజేస్తామని కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీకి చెందిన నితీశ్ కుమార్ రెడ్డి ఇండియా క్రికెట్ టీమ్ త‌రుఫున ఇంటర్నేష‌న‌ల్ మ్యాచ్‌లు ఆడేందుకు ఎంపిక కావటం శుభ‌ప‌రిణామమని అన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆల్ రౌండ‌ర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. నితీశ్ కుమార్ రెడ్డి లాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. నేటి యువతకు నితీష్ కుమార్ రెడ్డి రోల్ మోడల్ అని కొనియాడారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియాన్ని అమరావతిలో నిర్మిస్తామని ప్రకటించారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడేవిధంగా విశాఖపట్నం స్టేడియం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా‌ ఐపీఎల్ టీమ్ సిద్ధం చేసేలా ఏసీఏ ఆలోచన చేస్తోందని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం

Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం

Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 28 , 2024 | 09:19 PM