Share News

AP NEWS: ఆంధ్రప్రదేశ్-టోయామా మధ్య అవగాహన ఒప్పందం

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:47 PM

MoU Andhra Pradesh Toyama: మంగళగిరి ఏపీఐఐసీలో ఆంధ్రప్రదేశ్-టోయామా మధ్య ఒక కొత్త అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్-టోయామా మధ్య అవగాహన ఒప్పందాన్ని మరోసారి పునరుద్ధరించారు.

AP NEWS: ఆంధ్రప్రదేశ్-టోయామా మధ్య అవగాహన ఒప్పందం
MoU between Andhra Pradesh Toyama

అమరావతి: ఆంధ్రప్రదేశ్-టోయామా మధ్య అవగాహన ఒప్పందాన్ని మరోసారి పునరుద్ధరించారు. జపాన్‌లోని టోయామా ప్రాంతానికి చెందిన గవర్నర్ హచిరో నిట్టా (Hachiro Nitta)నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. మంగళగిరి ఏపీఐఐసీలో ఆంధ్రప్రదేశ్-టోయామా మధ్య ఒక కొత్త అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ హచిరో నిట్టా మీడియాతో మాట్లాడుతూ... 2015లో ఏపీతో ప్రారంభమైన ఈ సహకార సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా ఒప్పందం కుదిరిందని వివరించారు. వాణిజ్య, వ్యాపార రంగాల్లో పరస్పర సహకారం తీసుకుంటామని చెప్పారు. సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుకుంటామని అన్నారు. విద్యార్థులు, పరిశోధకుల మధ్య అనుసంధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ రంగంలో సాంకేతిక సహకారం, ఔషధ తయారీ రంగంలో సహకారం తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక జపనీస్ జెన్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయాల మధ్య సహకారం,సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించామని టోయామా గవర్నర్ నిట్టా తెలిపారు.


2015 నుంచి సాధించిన ప్రగతి:

  • ఇరు ప్రాంతాల మధ్య పలు పరస్పర పర్యటనలు.

  • సకుర సైన్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సాంస్కృతిక వినిమయ కార్యక్రమాలు.

  • టోయామాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

  • ఔషధ తయారీ రంగంలో సంయుక్త చర్చా వేదికలు.

  • ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జపనీస్ భాషా కేంద్రం ఏర్పాటు


ఈ వార్తలు కూడా చదవండి..

Nadendla Manohar: ఆ చట్టంపై అవగాహన ఉండాలి

Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..

YCP: వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

Minister Nara Lokesh : శ్యామ్‌ బెనగల్‌ మృతికి లోకేశ్‌ సంతాపం

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 24 , 2024 | 05:50 PM