Share News

MP Raghurama Raju: టీడీపీ - జనసేన కూటమి ప్రభుత్వం రావడం పక్కా..

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:27 AM

Andhrapradesh: జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో 135 నుంచి 155 సీట్లు నెగ్గి టీడీపీ - జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

MP Raghurama Raju: టీడీపీ - జనసేన కూటమి ప్రభుత్వం రావడం పక్కా..

పశ్చిమగోదావరి, జనవరి 17: జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnam Raju) ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో 135 నుంచి 155 సీట్లు నెగ్గి టీడీపీ - జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకురాలు షర్మిల కారణంగా వైసీపీ సంప్రదాయ ఓట్ల నుంచి ఐదు నుంచి ఏడు శాతం చీలిపోనున్నాయన్నారు.

నిన్నటి సుప్రీంకోర్టులో 17ఏ తీర్పును వక్రీకరిస్తూ సొంత పేపర్లో అసత్య కథనాలు రాయించారని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలోనే విచారణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలన పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత సొంత నియోజకవర్గంలో పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సమావేశాలు అనంతరం నియోజవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. కాగా... ఆత్మీయ సమావేశంలో ఆర్‌ఆర్‌ఆర్ ఫుల్ హ్యాపీ అనే టైటిల్ గల కేక్‌ను కట్ చేసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 17 , 2024 | 12:09 PM