Share News

AP NEWS: రేపో మాపో ఆ సీఎం అరెస్టు అవ్వడం ఖాయం.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Feb 02 , 2024 | 09:48 PM

సీఎం జగన్(CM JAGAN) మీద 12కేసులు ఉన్నా.. యథేచ్చగా బయట తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) అన్నారు. దేశంలోనే 420ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జవాబుదారీ పార్లమెంట్‌ను పక్కన పెట్టి.. మోదీ ఇజమని చెబుతున్నారని మండిపడ్డారు.

AP NEWS: రేపో మాపో ఆ సీఎం అరెస్టు అవ్వడం ఖాయం.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

అమరావతి: సీఎం జగన్(CM JAGAN) మీద 12కేసులు ఉన్నా.. యథేచ్చగా బయట తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) అన్నారు. శుక్రవారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలోనే 420ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జవాబుదారీ పార్లమెంట్‌ను పక్కన పెట్టి.. మోదీ ఇజమని చెబుతున్నారని మండిపడ్డారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు, పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు అని ప్రశ్నించారు. అప్పులు ఎంతో చెప్పాల్సింది పోయి దేవుడు, రామ మందిరం గురించి చెప్పడం ఏంటి అని నిలదీశారు. దేశ ప్రజలను దగా చేసే బడ్జెట్ ఇదని ధ్వజమెత్తారు. జార్ఖండ్‌లో ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఈడీ పేరుతో జార్ఘండ్ సీఎంను జైలుకు పంపటం అన్యాయమని చెప్పారు.

ఆ రాష్ట్రాలపై బీజేపీ కక్ష

లిక్కర్ స్కాంకు సూత్రధారులు వైసీపీ నేతలు. మధ్యవర్తిత్వం చేసింది కేసీఆర్ కూతురు కవిత అని ఆరోపించారు. ఢిల్లీలో షాపులు పెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన ఢిల్లీ డిప్యూటీ సీఎంను సిసోడియాను జైల్లో పెట్టారన్నారు. రేపో మాపో ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెడతారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే రాష్ట్రాలపై బీజేపీ కక్ష కడుతుందన్నారు. జార్ఖండ్, ఢిల్లీ ముఖ్యమంత్రులను నరేంద్ర మోదీ టార్గెట్ చేశారన్నారు. భారత్ దేశంలో జగన్ కంటే పెద్ద డేకాయిట్ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే అవే చివరి ఎన్నికలు అవుతాయని తెలిపారు. పార్లమెంటరీ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తారని ధ్వజమెత్తారు. వైసీపీని విమర్శిస్తే.. చంద్రబాబు తొత్తులు అంటున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి చెల్లి షర్మిల ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతోందన్నారు. షర్మిల కూడా చంద్రబాబు మనిషేనా? అని సీపీఐ నారాయణ నిలదీశారు.

Updated Date - Feb 02 , 2024 | 09:48 PM