AP pensions: పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం.. వారిపై ప్రభుత్వం చర్యలు
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:00 PM
AP pensions: ప్రతి నెలా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీలో ప్రతి నెలా రికార్డులు తిరగ రాస్తున్న విషయం తెలిసిందే.
ఏలూరు జిల్లా : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గాడితప్పిన పాలనను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తొలినెలలోనే సామాజిక పింఛన్లు రూ.1000లకు పెంచిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫించన్లను (AP Pension) ఇవాళ(మంగళవారం) పంపిణీ చేసింది. ఒకరోజు ముందుగానే ఫించన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా ఫించన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయ్యింది. ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేయాలని సర్కారు నిర్ణయించిన కొతమంది అధికారులు నిర్లక్ష్యంగా ఉండటంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. వీరిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కూడా ఫించన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు ఫించన్లను అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వ పింఛన్ల పంపిణీకి హాజరు కానీ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నూజివీడు మండలం పాత రావిచర్ల గ్రామసచివాలయ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి హాజరుకానీ విలేజ్ సర్వేయర్, అంగన్వాడీ టీచర్లకు నూజివీడు ఎండీవో నోటీసులు పంపించారు. సూర్యోదయాన్నే పెన్షన్లు పంపిణీ చేసి లబ్ధిదారుల ఆనందాన్ని చూరగొనాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు పరచకుండా, వ్యతిరేకంగా ప్రవర్తించిన ఉద్యోగులపై కఠిన చర్యలు చేపట్టారు. ప్రతి నెలా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీలో ప్రతి నెలా రికార్డులు తిరగ రాస్తున్న విషయం తెలిసిందే.
కాగా వీలైనంత త్వరగా తొలి రోజే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేందుకు ఉద్యోగులు ప్రయత్నం చేశారు. గత జగన్ ప్రభుత్వం ఎవరైనా స్థానికంగా పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెలలో ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వెసులుబాటు కల్పించింది. మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా ఆ మరుసటి నెల మొత్తం అందించేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా దివ్యాంగ విద్యార్థులు స్థానికంగా అందుబాటులో లేకపోతే అలాంటివారికి వారు నివశించే ప్రాంతంలో పెన్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivasa Rao: మంత్రుల మార్పుపై.. పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్
AP High Court: పేర్నినానికి హైకోర్టులో స్వల్ప ఊరట
AP News: చిత్తూరు జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ
AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే
Read Latest AP News And Telugu News